అక్షరటుడే, భీమ్గల్: Bheemgal BJP | భీమ్గల్ మున్సిపాలిటీ (Bheemgal Municipality) ఛైర్పర్సన్ అభ్యర్థిని నిర్ణయించామని జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి (Chairman Palle Gangareddy), సీనియర్ నాయకులు ఏలెటి మల్లికార్జున్ రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎల్జే ఫంక్షన్ హాల్లో కార్యక్రమంలో బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థులకు బీ-ఫాంలను (B-forms) అందజేశారు.
Bheemgal BJP | బల్దియా ఛైర్మన్ అభ్యర్థిగా కొండ గోదావరి..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అభ్యర్థులు ఎలాంటి భయాలకు లోనవ్వకుండా ఆత్మవిశ్వాసంతో ఎన్నికల బరిలో దూసుకుపోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అందిస్తున్న అవినీతి రహిత పాలనను ఇంటింటికీ వెళ్లి వివరించాలని సూచించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటుందని, తమ పార్టీ తరపున మాజీ ఎంపీపీ కొండ గోదావరిని మున్సిపల్ ఛైర్పర్సన్ అభ్యర్థిగా బరిలో నిలుపుతున్నట్లు ప్రకటించారు. అభ్యర్థులందరూ సమన్వయంతో పనిచేసి విజయం సాధించాలని సూచించారు. బీజేపీ అంటేనే ప్రజల్లో నమ్మకం ఉందని.. ఆ నమ్మకాన్ని కాపాడుతూ.. అభ్యర్థులు ప్రచారం నిర్వహించాలని సూచించారు. తప్పకుండా విజయం బీజేపీకే వరిస్తుందని పేర్కొన్నారు.