అక్షరటుడే,ఇందూరు : VHP- Bajrang Dal | బంగ్లాదేశ్‌లో (Bangladesh) హిందువులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని విశ్వహింద్పరిషత్ (Vishva Hindu Parishad), బజరంగ్దళ్, హిందూవాహిని సంస్థలు పేర్కొన్నాయి. ఈ మేరకు మంగళవారం ఆయా సంస్థల ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చౌక్‌లో బంగ్లాదేశ్ ప్రధాని దిష్టిబొమ్మను నాయకులు దహనం చేశారు.
VHP- Bajrang Dal | అరాచకాలను ఆపాల్సిందే..
ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు దినేష్ ఠాకూర్ (Dinesh Thakur) మాట్లాడుతూ హిందువులపై దాడులను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ అరాచకాన్ని వెంటనే ఆపాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గాజుల దయనంద్, కోశాధికారి నాంపల్లి శేఖర్, జిల్లా సేవా ప్రముఖ్ రాంప్రసాద్ చటర్జీ, హిందూవాహిని జిల్లా సంయోజక్ సాయి ప్రసాద్, ధాత్రిక రమేష్, నగర అధ్యక్షుడు కోడిమేల శ్రీనివాస్, నగర కార్యదర్శి బాసొల్లా నీకేష్, నగర సహకార్యదర్శి సతీష్, బజరంగ్దళ్ నగర సహా సంయోజక్ అఖిలేష్, దేవాకతే మహేష్, తులసీదాస్, హర్షవర్ధన్, కార్తీక్, బంజా రమేష్, శ్యాం, సంపత్, శ్రీనివాస్, బజరంగ్దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు.