అక్షరటుడే, మెండోరా/ఆర్మూర్ : Sriram Sagar | శ్రీరామ్‌సాగర్ నుంచి యాసంగి సీజన్‌కు (Yasangi season) నీటి విడుదలను అధికారులు బుధవారం ప్రారంభించారు. కాకతీయ, సరస్వతి కాలువకు నీటిని విడుదల చేశారు.
ఎస్సారెస్పీ ఆయకట్టు కింద యాసంగి సాగు పనులు జోరందుకున్నాయి. దీంతో నీటి విడుదల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల సమావేశం అయిన అధికారులు నీటి విడుదల ప్రణాళికను ఖరారు చేశారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (Sriram Sagar project) సూపరింటెండింగ్ ఇంజనీర్, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు కాకతీయ కాలువకు నీటి విడుదలను ప్రారంభించారు. వారాబంధీ ప్రకారం కాకతీయ కాలువ (Kakatiya canal) పరిధిలోని జోన్ –1, జోన్–2లకు నీటిని వదలనున్నారు. ప్రస్తుతం 3,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కాలువకు నీటి విడుదల నేపథ్యంలో పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Sriram Sagar | సరస్వతి కాలువకు..
ఎస్సారెస్పీ నుంచి నిర్మల్ జిల్లాకు సాగు నీరు అందించే సరస్వతి కాలువకు సైతం నీటి విడుదలను అధికారులు ప్రారంభించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇంజినీర్లు, నిర్మల్ నీటిపారుదల శాఖ అధికారులు (Nirmal irrigation department officials) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 350 క్యూసెక్కులను కాలువకు వదులుతున్నారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Sriram Sagar | యాసంగికి ఢోకా లేనట్లే..
ఈ ఏడాది వానాకాలం సమృద్ధిగా వర్షాలు పడ్డాయి. దీంతో శ్రీరామ్ సాగర్‌కు భారీగా వరద వచ్చింది. వానాకాలం ముగిసి, యాసంగి సీజన్ ప్రారంభం అయినా ప్రాజెక్ట్ ప్రస్తుతం నిండుకుండలా ఉంది. దీంతో ఆయకట్టు కింద యాసంగి పంటలకు ఢోకా లేదని రైతులు అంటున్నారు. కాగా నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.