అక్షరటుడే, ఆర్మూర్: Sriram Sagar Project | శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి కాలువ ద్వారా ఆయకట్టుకు గురువారం నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కొత్త రవి తెలిపారు. ఆయకట్టు పరిధిలో వానాకాలం పంటకు సాగునీరు అందించే అంశంపై తెలంగాణ నీటి పారుదల శాఖ (Telangana Irrigation Department) ఆధ్వర్యంలో సమావేశం జరిగిందన్నారు.
రాష్ట్రస్థాయి సమీకృత నీటి ప్రణాళిక యాజమాన్య కమిటీ (Water Plan Management Committee) సమావేశ నిర్ణయం ప్రకారం ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయడానికి నిర్ణయించినట్లు తెలిపారు. కాకతీయ, లక్ష్మి కాల్వలకు గురువారం ఉదయం 11 గంటల నుంచి సాగునీటిని విడుదల చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.