Homeటెక్నాలజీYouTube Ad blockers | యాడ్​తోనే వీడియోలు చూడాలి.. లేదంటే వీక్షణకు ఆటంకం

YouTube Ad blockers | యాడ్​తోనే వీడియోలు చూడాలి.. లేదంటే వీక్షణకు ఆటంకం

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: YouTube Ad blockers కు ఆ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. “Ad blockers are not allowed on YouTube” అని హెచ్చరించింది. యూజర్ తమ బ్రౌజర్‌లో ప్రకటన నిరోధక సాధనాన్ని (Ad Blocker) వాడితే వారిని అనుమతించదు. Allow YouTube Ads – అంటే Ad Blocker ను ఆపి, ప్రకటనలతోనే వీడియోలు చూడాలని స్పష్టం చేసింది.

ప్రకటనల వల్లే YouTube మిలియన్ల మందికి ఉచితంగా అందుబాటులో ఉందనేది సంస్థ వాదన. అంటే యూజర్‌లకు ఉచిత కంటెంట్ అందించడంలో ప్రకటనల పాత్ర, ఆదాయం కీలకమైందని పేర్కొంది.

ప్రకటనలు లేకుండా వీడియోలు చూడాలనుకునే వారికి, YouTube Premium సేవను అందుబాటులో ఉంచామని, దీనిని వినియోగించుకోమని సంస్థ సూచించింది. తద్వారా క్రియేటర్ల(creators)కు ఆదాయం లభిస్తుందని చెప్పుకొచ్చింది.

YouTube తన ఆదాయ వనరులైన ప్రకటనలను కాపాడుకునేందుకు, క్రియేటర్లకు నష్టం కలగకుండా చూడటానికి ఈ చర్యలు తీసుకున్నట్లు చెబుతోంది. యూజర్లు ప్రకటనలు చూడకపోతే, ఆదాయ వనరులు తగ్గిపోతాయని పేర్కొంది.

YouTube‌ను నిరంతరం ఉపయోగించాలనుకుంటే, ప్రకటనలను అనుమతించాలని, లేదంటే.. YouTube Premium సేవను వినియోగించుకోవాలని తెలిపింది. Ad Blocker వాడితే మాత్రం.. మీ వీడియో వీక్షణాన్ని YouTube అడ్డుకుంటుందని వెల్లడించింది.