iPhone | కెమెరా లేని ఐఫోన్.. ఇప్పుడు వాడే ఫోన్స్ క‌న్నా చాలా కాస్ట్‌లీ గురూ..!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : iPhone | సాధారణంగా ఐఫోన్ అంటే ముందుగా గుర్తొచ్చేది కెమెరా క్వాలిటీ (Camera Quality). కానీ కెమెరాలు లేని ఐఫోన్‌లు కూడా ఉన్నాయనేది చాలా మందికి తెలియని విషయమే. బయటకు చూస్తే ఇవి మనం ఉపయోగించే ఐఫోన్‌లలా కనిపించినా, వెనుక భాగంలో ఒక్క కెమెరా లెన్స్ కూడా ఉండదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ కెమెరా లేని ఐఫోన్‌లకే మార్కెట్లో భారీ డిమాండ్ ఉండడంతో పాటు, వీటి ధర సాధారణ ఐఫోన్‌లకంటే చాలా […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : iPhone | సాధారణంగా ఐఫోన్ అంటే ముందుగా గుర్తొచ్చేది కెమెరా క్వాలిటీ (Camera Quality). కానీ కెమెరాలు లేని ఐఫోన్‌లు కూడా ఉన్నాయనేది చాలా మందికి తెలియని విషయమే. బయటకు చూస్తే ఇవి మనం ఉపయోగించే ఐఫోన్‌లలా కనిపించినా, వెనుక భాగంలో ఒక్క కెమెరా లెన్స్ కూడా ఉండదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ కెమెరా లేని ఐఫోన్‌లకే మార్కెట్లో భారీ డిమాండ్ ఉండడంతో పాటు, వీటి ధర సాధారణ ఐఫోన్‌లకంటే చాలా ఎక్కువగా ఉంటుంది.

iPhone | కెమెరా లేని ఐఫోన్‌లు ఎందుకు తయారు చేస్తారు?

కెమెరాల నిషేధిత ప్రాంతాల్లో వాడేందుకు ప్రత్యేకంగా ఈ ఐఫోన్‌లు రూపొందించబడతాయి. అత్యంత సెక్యూరిటీ అవసరమయ్యే కొన్ని ప్రదేశాల్లో కెమెరా ఫోన్లు పూర్తిగా బ్యాన్ చేయబడతాయి. అణు కర్మాగారాలు, సైనిక స్థావరాలు, ల్యాబొరేటరీలు, షిప్‌యార్డులు, అత్యంత రహస్య పరిశోధన కేంద్రాలు (Secret Research Centers).. ఇలాంటి హై-సెక్యూరిటీ ఏరియాల్లో పనిచేసే ఉద్యోగులు ఏ పరిస్థితుల్లోనూ కెమెరా ఉన్న ఫోన్లు ఉపయోగించకూడదు. అందుకే వారికి ప్రత్యేకంగా కెమెరా లేని ఐఫోన్‌లను అందిస్తారు. PetaPixel రిపోర్టుల ప్రకారం, అణు పరిశ్రమల్లో ఇది తప్పనిసరి.

iPhone | ధర ఎంతంటే..?

ఆశ్చర్యంగా ఉన్నా నిజం . కెమెరా ఉన్న ఐఫోన్‌లకంటే కెమెరా లేని ఐఫోన్‌ల ధరలు ఎక్కువే. ఈ ఫోన్‌లను నాన్‌క్యామ్ (NonCam) అనే సంస్థ విక్రయిస్తోంది.

iPhone SE (2020) — సుమారు $1,130

iPhone SE (2022) — సుమారు $1,680

ఇవి మార్కెట్లో ఉన్న అసలు ఐఫోన్ ధరల కంటే డబుల్ లేదా ట్రిపుల్ రేట్లు. కారణం, ఈ ఫోన్‌లు హై సెక్యూరిటీ ప్రాంతాల్లో తప్పనిసరి కావడం, అవసరం ఎక్కువగా ఉండడం.

వీటిని ఆపిల్ తయారుచేస్తుందా? అంటే లేదు…! ఈ కెమెరా లేని ఐఫోన్‌లను ఆపిల్ తయారుచేయదు. ఇది పూర్తిగా థర్డ్ పార్టీ కంపెనీల పని. NonCam, Mister Mobile వంటి సంస్థలు అసలు ఐఫోన్‌లలోని కెమెరా మాడ్యూల్‌ను అత్యంత కచ్చితత్వంతో తొలగిస్తాయి. బయటకు చూస్తే ఆపిల్ స్వయంగా అలా డిజైన్ చేసినట్టే కనిపిస్తుంది. రహస్య రక్షణ విభాగాలు, అణు పరిశోధనా కేంద్రాలు, ఆయుధ తయారీ యూనిట్లు, సైనిక నౌకాదళ బేస్‌లు, హై సెక్యూరిటీ ఆఫీస్‌లు వంటి ప్ర‌దేశాలలో ఎక్కువ‌గా వాడ‌తారు. కెమెరా లేకపోయినా, ఈ ఐఫోన్‌లు సెక్యూరిటీ పరంగా చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...