అక్షరటుడే, వెబ్‌డెస్క్: US President Donald Trump : యూఎస్ జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్జ్(US National Security Advisor Mike Walz)పై వేటు పడింది. ఆయనను ఆ పదవి నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పక్కనపెట్టారు. వాల్జ్ స్థానంలో తాత్కాలిక భద్రతా సలహాదారుగా విదేశాంగశాఖ మంత్రి రుబియోను నియమిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. వాల్జ్‌కు మరో పోస్టు ఆఫర్ చేసి, ఐక్యరాజ్య సమితి రాయబారిగా పంపించారు.
యెమెన్‌పై మార్చి 15న దాడులకు సంబంధించిన సమాచారం ప్రకటించక ముందే సిగ్నల్‌లోని గ్రూప్‌చాట్ ద్వారా ఆ విషయం ఓ పాత్రికేయుడికి తెలిసింది. అధికారిక గ్రూప్‌లో పొరపాటున సదరు పాత్రికేయుడిని చేర్చినట్లు వాల్జ్ చెప్పుకొచ్చారు. దీనికి పూర్తి బాధ్యత తనదేనని ఒక ఇంటర్వ్యూలో కూడా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వాల్జ్‌ను జాతీయ భద్రతా సలహాదారు పదవి నుంచి డోనాల్డ్ ట్రంప్ తొలగించారు.