US President Donald Trump | యుద్ధ రహస్యాలు లీక్​.. యూఎస్​ జాతీయ భద్రతా సలహాదారుపై వేటు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: US President Donald Trump : యూఎస్​ జాతీయ భద్రతా సలహాదారు మైక్‌ వాల్జ్‌(US National Security Advisor Mike Walz)పై వేటు పడింది. ఆయనను ఆ పదవి నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పక్కనపెట్టారు. వాల్జ్‌ స్థానంలో తాత్కాలిక భద్రతా సలహాదారుగా విదేశాంగశాఖ మంత్రి రుబియోను నియమిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. వాల్జ్​కు మరో పోస్టు ఆఫర్​ చేసి, ఐక్యరాజ్య సమితి రాయబారిగా పంపించారు. యెమెన్‌పై మార్చి 15న దాడులకు సంబంధించిన సమాచారం […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: US President Donald Trump : యూఎస్​ జాతీయ భద్రతా సలహాదారు మైక్‌ వాల్జ్‌(US National Security Advisor Mike Walz)పై వేటు పడింది. ఆయనను ఆ పదవి నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పక్కనపెట్టారు. వాల్జ్‌ స్థానంలో తాత్కాలిక భద్రతా సలహాదారుగా విదేశాంగశాఖ మంత్రి రుబియోను నియమిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. వాల్జ్​కు మరో పోస్టు ఆఫర్​ చేసి, ఐక్యరాజ్య సమితి రాయబారిగా పంపించారు.

యెమెన్‌పై మార్చి 15న దాడులకు సంబంధించిన సమాచారం ప్రకటించక ముందే సిగ్నల్‌లోని గ్రూప్‌చాట్‌ ద్వారా ఆ విషయం ఓ పాత్రికేయుడికి తెలిసింది. అధికారిక గ్రూప్‌లో పొరపాటున సదరు పాత్రికేయుడిని చేర్చినట్లు వాల్జ్‌ చెప్పుకొచ్చారు. దీనికి పూర్తి బాధ్యత తనదేనని ఒక ఇంటర్వ్యూలో కూడా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వాల్జ్‌ను జాతీయ భద్రతా సలహాదారు పదవి నుంచి డోనాల్డ్ ట్రంప్ తొలగించారు.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...