అక్షరటుడే, వెబ్‌డెస్క్: War 2 Teaser | యంగ్ టైగర్ ఎన్టీఆర్ (young tiger NTR) ఇటీవల దేవర సినిమాతో (devara movie) ప్రేక్షకుల ముందుకు రాగా, ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో (prashanth neel direction) మూవీ చేస్తున్నారు. ఈ చిత్రం కన్నా ముందే బాలీవుడ్‌లో వార్ 2 చిత్రం (war 2 movie) చేశాడు. ఈ చిత్రం ఆగస్ట్‌లో రిలీజ్ కానుండగా, ఇందులో ఎన్టీఆర్ లుక్ (NTR look) ఎలా ఉంటుందని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ రోజు ఎన్టీఆర్ బర్త్ డే (NTR birthday) సందర్భంగా ఎన్టీఆర్- హృతిక్ రోషన్ (NTR – hrithik roshan) కలిసి నటించిన మోస్ట్ అవైటెడ్ ‘వార్ 2’ టీజర్ విడుదలైంది. తారక్, హృతిక్ యాక్షన్ సీన్స్, విజువల్స్ (action secens and visuals) ఆకట్టుకుంటున్నాయి. టీజర్ చూస్తుంటే హృతిక్, ఎన్టీఆర్ మధ్య భీకర పోరు జరిగేలా ఉంది.
War 2 Teaser | టీజర్ అదరహో..
నా గురించి నువ్వు ఇప్పుడు తెలుసుకుంటావ్ కబీర్ అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్.. యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో (international standards) ఉన్నాయి. ఈ మూవీ ఈజీగా వెయ్యి కోట్లు కొల్లగొట్టబోతోందని ఈ ఒక్క టీజర్ చెబుతోంది. బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ (bollywood director ayan mukerji) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హృతిక్ రోషన్ (hrithik roshan) కథానాయకుడిగా నటిస్తుండగా.. ఎన్టీఆర్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. టీజర్‌లో హృతిక్ రోషన్‌తో ఆయన తలపడే సన్నివేశాలు సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. కైరా అద్వానీ (kiara advani) కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. ‘వార్’ చిత్రానికి ఇది సీక్వెల్ కావడంతో యాక్షన్ సన్నివేశాలు మరింత ఉత్కంఠభరితంగా ఉండబోతున్నాయని టీజర్ ద్వారా తెలుస్తోంది.
‘ఆర్ఆర్ఆర్’తో (RRR) అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఎన్టీఆర్, ‘వార్ 2’తో బాలీవుడ్‌లో (bollywood) ఎలాంటి సంచలనం సృష్టిస్తారో అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 14, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ‘వార్ 2’ (war 2) సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఎంట్రీ (NTR bollywood entry) ఇవ్వనున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ (ayan mukerji) దర్శకత్వం వహిస్తున్నారు. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే దాదాపు షూటింగ్ అంతా కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసారు. హృతిక్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. కానీ ఇంతవరకూ సినిమా నుంచి ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ బయటకు రాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు.