అక్షరటుడే, ఇందూరు: Panchayat elections | గ్రామపంచాయతీ ఎన్నికల్లో (Gram Panchayat elections) భాగంగా మూడో విడత ఎన్నికలు బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభంగా కాగా.. పోలింగ్ ప్రశాంత వాతావరణలో కొనసాగుతోంది. చలిని (cold weather) లెక్కచేయకుండా మహిళలు, వృద్ధులు సైతం ఓటేసేందుకు క్యూలో నిలబడ్డారు. ఆర్మూర్ డివిజన్లోని (Armoor division) 12 మండలాల్లో ఎన్నికలు కొనసాగుతున్నాయి. తొలి రెండు గంటల్లో (ఉదయం 9 గంటల వరకు) 23.35 శాతం ఓటింగ్ నమోదైంది.

Panchayat elections | చలి తీవ్రత ఉన్నప్పటికీ..
11 గంటల వరకు 54.69 శాతం ఓట్లు వేశారు. ఉదయం చలి తీవ్రతతో మందకొడిగా సాగినా.. 9 గంటల తర్వాత ఓటింగ్ సరళి పుంజుకుంది. ఆలూరు మండలంలో 56.96 శాతం, ఆర్మూర్లో 56.64 శాతం, బాల్కొండలో 49.08 శాతం, భీమ్గల్లో మండలంలో 58.68 శాతం, డొంకేశ్వర్ మండలంలో 56.62 శాతం, కమ్మర్పల్లిలో 52.96 శాతం, మెండోరా 58.14 శాతం, మోర్తాడులో 51.48 శాతం, ముప్కాల్ మండలంలో 52.77 శాతం, నందిపేట్ మండలంలో 55.41, వేల్పూర్లో 51.48 శాతం, ఏర్గట్లలో 56.45శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 3,06795 మంది ఓటర్లకు గాను.. 1,67,775 మంది ఓట్లు వేశారు.
