అక్షరటుడే, మెండోరా : Volleyball Tournament | మెండోరా (Mendora) మండలంలో యువతకు వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్లు ఎస్సై సుహాసిని (SI Suhasini) పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం పోచంపాడ్‌లోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల (ZPHS School)లో వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ కమిషనరేట్ ఆదేశాల మేరకు శనివారం వాలీబాల్ పోటీలు (Volleyball Competitions) జరుగనున్నాయన్నారు.
Volleyball Tournament | చెడు వ్యసనాల నుంచి దూరం చేసేందుకు..
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. చెడువ్యసనాల నుంచి మాదకద్రవ్యాల నుంచి దూరంగా ఉంచేందుకు ఈ క్రీడలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. క్రీడలతో శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం పెరగుతుందన్నారు. క్రీడలు భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడతాయని ఆమె వెల్లడించారు. పోటీలు పోచంపాడ్ (Pochampad) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నామని పేర్కొన్నారు. స్థానిక యువత ఉత్సాహంగా పాల్గొనాలని ఎస్సై కోరారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శోభ, స్థానిక నాయకులు గంగారెడ్డి, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
