Homeటెక్నాలజీVivo T4 Ultra | వివో T4 అల్ట్రా లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేష‌న్స్ ఏంటి,...

Vivo T4 Ultra | వివో T4 అల్ట్రా లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేష‌న్స్ ఏంటి, ధ‌ర ఎంత ?

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Vivo T4 Ultra | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో (Vivo) తన కొత్త మిడ్‌రేంజ్ ఫోన్ Vivo T4 Ultra ను భారతదేశంలో జూన్ 11న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ వివరాలను ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న ప్రత్యేక మైక్రోసైట్ ద్వారా నిర్ధారించారు. వివో అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ఈ లాంచ్ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ (Live streaming) రూపంలో ప్రసారం కానుంది. అక్కడ నుంచి వినియోగదారులు ధర, ఫీచర్లు వంటి అన్ని అధికారిక వివరాలను తెలుసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ ప్రకారం, Vivo T4 Ultra ఫోన్‌లో ఉండే ముఖ్యమైన ఫీచర్లు చూస్తే..

Vivo T4 Ultra | ఫీచ‌ర్స్ ఏంటంటే..

ట్రిపుల్ కెమెరా సెట్‌అప్, 50MP Sony IMX921 మెయిన్ కెమెరా (OIS – ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో),
8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50MP Sony IMX882 పెరిస్కోప్ కెమెరా (OIS, 3x ఆప్టికల్ జూమ్‌తో), 10x టెలిఫోటో మాక్రో జూమ్ – ఈ సెగ్మెంట్‌లో ఇదే మొదటిది అని కంపెనీ చెబుతోంది. వివో T4 అల్ట్రా 5G ఫోన్ 16.94cm (6.67-అంగుళాల) pOLED క్వాడ్ కర్వ్డ్ ప్యానెల్‌తో 120Hz రిఫ్రెష్ రేట్‌తో లాంచ్ అవుతుంది. ఐ కేర్ సర్టిఫికేషన్‌ను కూడా అందిస్తుంది..గతేడాది విడుదలైన T3 అల్ట్రా మోడల్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్ ఉన్నప్పటికీ, కెమెరా పరంగా ఆకట్టుకోలేకపోయింది. ఇందులో 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా మాత్రమే ఉండేది.

అయితే ఈసారి వివో T4 Ultra విషయంలో కెమెరా సామర్థ్యాన్ని పెంచారు. నెట్టింట్లో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. ఇది 6.67 అంగుళాల pOLED డిస్‌ప్లేతో వస్తున్నట్లు టాక్. ఇది 120Hz రిఫ్రెష్‌రేట్‌ కలిగి ఉండనుందని సమాచారం. T4 Ultra మోడల్‌లో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటి 9300 ప్రాసెసర్ ఉపయోగించినట్లు తెలిసింది. ఈ మోడల్‌ బ్యాటరీ వివరాలు తెలియనప్పటికీ 90W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో రానున్నట్లు తెలిసింది. అయితే సెల్ఫీ కెమెరా, బ్యాటరీ కెపాసిటీ వివరాలు త్వరలో వెలువడనున్నాయి. వివో T3 అల్ట్రా’ స్మార్ట్ఫోన్ను గతేడాది సెప్టెంబర్‌లో భారతదేశంలో విడుదలైంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్‌సెట్, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 8GB RAM + 128GB మోడల్ ధర రూ. 31,999 ఉంది. అయితే దీనికి మించి అప్ గ్రేడెడ్ ఫీచర్లతో వస్తున్న వివో T4 అల్ట్రా ఎక్కువ ధరలో లాంచ్ కావొచ్చని సమాచారం. ఈ వివో ఫోన్ ధర రూ. 30వేలు, రూ. 35వేలు ఉంటుందని అంచనా. T4 Ultra మోడల్‌లో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్ ఉపయోగించినట్లు తెలిసింది.