Virat Kohli
Virat Kohli | ట్రెండింగ్‌లో విరాట్ కోహ్లీ అరెస్ట్‌… ఆయ‌న ఏం త‌ప్పు చేశాడు..!

అక్షరటుడే, వెబ్​డెస్క్: Virat Kohli | ఐపీఎల్ 2025 టోర్నీ అంతా స‌మష్టిగా ఆడుతూ క‌ప్ అందుకుంది ఆర్సీబీ జ‌ట్టు RCB. 17 ఏళ్ల త‌ర్వాత వారు క‌ప్ అందుకోవ‌డంతో ఆనందం అంతా ఇంతా కాదు. జూన్ 4న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. కానీ ఇప్పుడు ఆర్సీబీకి ఆ ఆనందమే లేకుండా పోయింది. ఈ జట్టు కొట్టిన ఒక్క కప్పు ఏకంగా 11 ప్రాణాలను బలితీసుకుంది. ఈ క్ర‌మంలో ఇండియ‌న్ స్టార్ క్రికెట‌ర్, ఆర్సీబీ మాజీ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ(Virat Kohli)ని అరెస్ట్ చేయాలంటూ సోష‌ల్ మీడియాలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఆర్సీబీపై నెటిజన్లు మండిపడుతున్నారు. సరైన భద్రతా ఏర్పాట్లు చేయకుండా విజయోత్సవ వేడుకలు నిర్వహించిన ఆర్‌సీబీ(RCB)పై చర్యలు తీసుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఆర్సీబీని రెండేళ్ల పాటు నిషేధం విధించాలని కూడా కోరుతున్నారు.

Virat Kohli | చిక్కుల్లో కోహ్లీ..

ఐపీఎల్(IPL) చ‌రిత్ర‌లో తొలిసారి ఆర్సీబీ ఛాంపియ‌న్‌గా నిల‌వ‌డంతో ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు, క్రికెట్ ప్రియులు వేల సంఖ్యలో స్టేడియానికి తరలివెళ్లారు. ముఖ్యంగా కోహ్లీ (Virat Kohli) ఫ్యాన్స్ స్టేడియంను చుట్టేశారు. ఈ క్ర‌మంలో తొక్కిస‌లాట జ‌రిగి ఏకంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 47 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స్టేడియం బయట భారీ సంఖ్యలో అభిమానులు మృతి చెందితే.. అదే టైంలో స్టేడియం లోపల మాత్రం ఆనందోత్సవాల మధ్య ఆర్సీబీ ప్లేయర్లకు సన్మానాలు చేశారు. ఇది నెటిజ‌న్ల ఆగ్ర‌హానికి గురి చేసింది. ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

హైదరాబాద్‌(Hyderabad)లో పుష్ప సినిమా సందర్భంగా తొక్కిసలాటలో ఒకరు మరణిస్తే ఆ సినిమా హీరో అల్లు అర్జున్‌(Allu Arjun)ను అరెస్ట్ చేశారని, ఇప్పుడు విరాట్ కోహ్లీని అరెస్ట్ చేసే దమ్ముందా? అని ప్రశ్నిస్తున్నారు. విరాట్ కోహ్లీని చూసేందుకే అభిమానులు తరలి వచ్చారని, ఈ తొక్కిసలాటకు ప్రధాన కారణం విరాట్ కోహ్లీనేనంటూ వాదిస్తున్నారు. తొక్కిసలాట ఘటన జరిగినా.. ఆర్సీబీ తమ వేడుకలను జరుపుకుందని, వారికి అభిమానుల ప్రాణాలు అంటే లెక్కలేదని మండిపడుతున్నారు. ఇప్పుడు చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy Stadium)లో ఆర్సీబీ కప్ గెలిచిన మరునాడే సన్మాన సభ పెట్టడం, భారీ సంఖ్యలో అభిమానులు వస్తారని కర్ణాటక ప్రభుత్వం(Karnataka Govt). అంచనా వేయలేకపోవ‌డం, ఏర్పాట్లు సరిగ్గా చేయ‌డం, స‌రైన ప్రణాళిక లేకపోవడం తొక్కిస‌లాట‌కు కార‌ణమయ్యాయి. అయితే కప్ గెలిచిన క్ర‌మంలో చాలా మంది కోహ్లీపై త‌మ ప్రేమ చూపించారు. ఈ క్ర‌మంలో #weloveyoukohli బాగా ట్రెండ్ అయింది. ఇక కోహ్లీ వ‌ల్ల‌నే 11 మంది మ‌ర‌ణించార‌ని, ఆయ‌న‌ను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ వినిపిస్తున్న నేప‌థ్యంలో #arrestkohli హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది.