అక్షరటుడే, భీమ్గల్ : Veerabrahmendra Swami Kalyanotsavam | వేల్పూర్ మండల కేంద్రంలో గురువారం ఆధ్యాత్మిక చైతన్యం, దేశభక్తి ఉప్పొంగాయి. మండల కేంద్రంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జాతరను పురస్కరించుకుని నిర్వహించిన స్వామివారి కల్యాణోత్సవంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (MLA Vemula Prashanth Reddy) తన సతీమణి నీరజతో కలిసి పాల్గొన్నారు.
ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు (Devotees) ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఈ సందర్భంగా ఆయన కమిటీ సభ్యులకు సూచించారు.
Veerabrahmendra Swami Kalyanotsavam | శివాజీ స్ఫూర్తి ప్రదాత..
అనంతరం ఛత్రపతి శివాజీ జయంతి (Chhatrapati Shivaji Jayanti) వేడుకల్లో భాగంగా మండల కేంద్రంలోని శివాజీ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందూ సామ్రాజ్య స్థాపకుడు శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలు, దేశభక్తి నేటి యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆయన ఆశయ సాధనలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
