Karre Gutta Encounter | కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karre Gutta Encounter | తెలంగాణ (Telangana), ఛత్తీస్​గఢ్​ సరిహద్దులోని కర్రెగుట్టల్లో భారీ ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు (Maoists) మృతి చెందారు. మృతుల్లో అగ్రనేతలు ఉన్నట్లు సమాచారం. కర్రెగుట్టల్లో భారీగా మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు ఛత్తీస్​గఢ్​ పోలీసులు (Chhattisgarh Police), భద్రత బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో గురువారం బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఇరువైపుల నుంచి […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karre Gutta Encounter | తెలంగాణ (Telangana), ఛత్తీస్​గఢ్​ సరిహద్దులోని కర్రెగుట్టల్లో భారీ ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు (Maoists) మృతి చెందారు. మృతుల్లో అగ్రనేతలు ఉన్నట్లు సమాచారం.

కర్రెగుట్టల్లో భారీగా మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు ఛత్తీస్​గఢ్​ పోలీసులు (Chhattisgarh Police), భద్రత బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో గురువారం బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఇరువైపుల నుంచి కాల్పులు కొనసాగుతుండటంతో కర్రెగుట్టల్లో తుపాకుల మోత మోగుతోంది. ఈ క్రమంలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు.

Karre Gutta Encounter | దేవ్​జీ లక్ష్యంగా..

మావోయిస్టు అగ్రనేత, ఆ పార్టీ కార్యదర్శి దేవ్ జీ లక్ష్యంగా కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో బలగాలు సెర్చ్​ ఆపరేషన్​ (Search Operation) చేపట్టాయి. ఆపరేషన్​ కర్రెగుట్టలు –2 పేరిట కూంబింగ్​ (Coombing) చేపట్టగా ఎన్​కౌంటర్​ జరిగింది. ఈ ఘటనలో పలువురు మావోయిస్టు అగ్రనేతలు సైతం చనిపోయినట్లు తెలిసింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. కాగా గతేడాది ఏప్రిల్లో సైతం కర్రెగుట్టల్లో బలగాలు భారీ ఆపరేషన్​ చేపట్టాయి. సుమారు 20 వేల మంది బలగాలతో కర్రెగుట్టలను జల్లెడ పట్టారు. ఆ సమయంలో జరిగిన ఎన్​కౌంటర్లలో పలువురు చనిపోయారు. బలగాల రాకతో మావోయిస్టులు కర్రెగుట్టలను ఖాళీ చేశారు.

Karre Gutta Encounter | మధ్యప్రదేశ్​ నుంచి..

మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh) నుంచి తాజాగా కర్రెగుట్టల్లోకి మావోలు ప్రవేశించినట్లు సమాచారం రావడంతో బలగాలు కూంబింగ్​ చేపట్టాయి. ఐదు వేల మందితో అడవులను జల్లెడ పడుతున్నాయి. ఈ సందర్భంగా కాల్పుల్లో ఐదుగురు చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దేశంలో మార్చి 31 నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఆ గడువు సమీపిస్తుండటంతో ఆపరేషన్​ కగార్​ను ఉధృతం చేసింది. ఈ క్రమంలో కర్రెగుట్టల్లో బలగాలు ఆపరేషన్​ నిర్వహించాయి.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...