అక్షరటుడే, ఇందూరు: Nizamabad Vector College | జిల్లా కేంద్రంలోని వెక్టార్ జూనియర్ కళాశాల vector Junior College విద్యార్థులు మంగళవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో inter results విజయఢంకా మోగించారు. ఫస్టియర్లో ఎంపీసీలో MPC first year గౌరవ్ శర్మ (466), మణి చంద్ర, వంశీ, ఆశ్రిత, మనస్విని (466), సెకండియర్లో నిశాంత్ రెడ్డి (991), బైపీసీలో శ్రీ వర్షిని (989) మార్కులు సాధించారు.
ఈ సందర్భంగా కళాశాల ఛైర్మన్ మధుసూదన్ జోషి chairman Madhusudan Joshi మాట్లాడుతూ.. అత్యంత కఠినమైన జేఈఈ, నీట్లో JEE and NEET ఉత్తమ ర్యాంకులు సాధించి.. ఇంటర్లో తమ సత్తా చాటారని పేర్కొన్నారు. అనంతరం ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు సంతోష్, గజానంద్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.