ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​UPSC Calendar | యూపీఎస్సీ ఎగ్జామ్ క్యాలెండర్ 2026 విడుద‌ల‌.. ఏ ప‌రీక్ష‌లు ఎప్పుడెప్పుడు ఉన్నాయంటే..!

    UPSC Calendar | యూపీఎస్సీ ఎగ్జామ్ క్యాలెండర్ 2026 విడుద‌ల‌.. ఏ ప‌రీక్ష‌లు ఎప్పుడెప్పుడు ఉన్నాయంటే..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : UPSC Calendar | ప్ర‌భుత్వ ఉద్యోగాల కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న వారికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC శుభ‌వార్త చెప్పింది. 2026కు సంబంధించి నియామక పరీక్షల క్యాలెండర్‌ను విడుదల UPSC 2026 Calendar విడుద‌ల చేయ‌గా, UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2026 నోటిఫికేషన్ జనవరి 14, 2026న విడుదల కానుంది. ఫిబ్రవరి 3 వరకు అప్లయ్​ చేసుకునే అవ‌కాశం ఉంటుంది. UPSC CSE ప్రిలిమ్స్ పరీక్ష మే 24న జరుగుతుంది. మెయిన్స్ పరీక్ష ఆగస్టు 21, 2026న జరగనుంది. UPSC NDA-I, CDS-I రిక్రూట్‌మెంట్ 2026 నోటిఫికేషన్ డిసెంబర్ 10, 2025న విడుదల కానుంది. ఈ రెండింటికీ రాత పరీక్ష ఏప్రిల్ 12, 2026న జరుగుతుంది.

    UPSC Calendar | ఇవే తేదీలు..

    ఇతర ముఖ్యమైన నియామక పరీక్షలు, వాటి తేదీలు చూస్తే.. కంబైన్డ్ జియో-సైంటిస్ట్ (ప్రిలిమినరీ) 2026 పరీక్ష నోటిఫికేషన్ 03.09.2025న విడుదల కానుంది. దరఖాస్తులను 23.09.2025 వరకు అప్లై చేసుకోవచ్చు. పరీక్ష 08.02.2026న జరుగుతుంది. ఇంజనీరింగ్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) 2026 నోటిఫికేషన్ 17.09.2025న విడుదల కానుంది. దీనికి 07.10.2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎగ్జామ్ 08.02.2026న జరుగుతుంది. CBI (DSP) LDCE నోటిఫికేషన్ 24.12.2025న రానుంది. 13.01.2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష 28.02.2026న ఉంటుంది. CISF AC (EXE) LDCE-2026 నోటిఫికేషన్ 03.12.2025న వస్తుంది. దరఖాస్తులను 23.12.2025 వరకు అప్లై చేయవచ్చు. పరీక్ష 08.03.2026న ఉంటుంది. ఎన్డీఏ N.A. పరీక్ష (I), 2026 నోటిఫికేషన్ 10.12.2025న విడుదల చేస్తారు. మీరు దీని కోసం 30.12.2025 వరకు అప్లై చేసుకోవచ్చు. పరీక్ష 12.04.2026న జరుగుతుంది.

    CDS 2026 నోటిఫికేషన్ 10.12.2025న విడుదల చేయ‌నుండ‌గా, దీని కోసం 30.12.2025 వరకు అప్లయ్​ చేసుకోవచ్చు. ఎగ్జామ్ 12.04.2026న జరగనుంది. సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) 2026 నోటిఫికేషన్ 14.01.2026న విడుదల చేస్తారు. దరఖాస్తులను 03.02.2026 వరకు తీసుకుంటారు. పరీక్ష 24.05.2026న జరుగుతుంది. 2026 పరీక్షకు సంబంధించిన IES/ISS నోటిఫికేషన్ 11.02.2026న రానుంది. దరఖాస్తులను 03.03.2026 వరకు అప్లయ్​ చేసుకోవచ్చు. ఎగ్జామ్ 19.06.2026న జరగనుంది. ఇంజనీరింగ్ సర్వీసెస్ 2026 మెయిన్స్ ఎగ్జామ్ 21.06.2026న జరగనుంది. సెంట్రల్ ఆర్మ్​డ్​ పోలీస్ ఫోర్సెస్ (అసిస్టెంట్ కమాండెంట్స్) 2026 నోటిఫికేషన్ 18.02.2026న విడుదల చేయ‌నున్నారు. దీని కోసం 10.03.2026 వరకు దీని కోసం అప్లై చేసుకోవచ్చు. పరీక్ష 19.07.2026న జరుగుతుంది.

    కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (Combined Medical Services Examination) 2026 కోసం నోటిఫికేషన్ 11.03.2026న విడుదల కానుండ‌గా, దరఖాస్తులను 31.03.2026 వరకు స్వీకరిస్తారు. పరీక్ష 02.08.2026న జరుగుతుంది. సివిల్ సర్వీసెస్ (మెయిన్) 2026 పరీక్ష, 21.08.2026న జరుగనుంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ 2026 మెయిన్స్ పరీక్ష, నవంబర్ 22, 2026న జరుగుతుంది.

    Latest articles

    Professor Jayashankar | ఉమ్మడిజిల్లాలో ఘనంగా జయశంకర్​ జయంతి వేడుకలు

    అక్షరటుడే, నెట్​వర్క్​: Professor Jayashankar | ఉమ్మడిజిల్లాలో (nizamabad) (kamareddy)జయశంకర్​ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు...

    Pocharam Project | సాగునీటిని సద్వినియోగం చేసుకోవాలి

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Pocharam Project | పోచారం ప్రాజెక్ట్​ నుండి ప్రధాన కాలువలోకి 150 క్యూసెక్కుల నీటిని...

    Hyderabad | రోగిని ప్రేమించిన డాక్టర్.. చివరకు ఏమైందంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | రోగిని ప్రేమించిన ఓ డాక్టర్​.. ఆమె జీవితం విషాదంతం అయింది. మానసిక...

    Banswada mandal | పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు

    అక్షరటుడే, కామారెడ్డి: Banswada mandal | జిల్లాలో పేకాట స్థావరాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. పోలీసులు దాడులు చేస్తున్నా పేకాట...

    More like this

    Professor Jayashankar | ఉమ్మడిజిల్లాలో ఘనంగా జయశంకర్​ జయంతి వేడుకలు

    అక్షరటుడే, నెట్​వర్క్​: Professor Jayashankar | ఉమ్మడిజిల్లాలో (nizamabad) (kamareddy)జయశంకర్​ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు...

    Pocharam Project | సాగునీటిని సద్వినియోగం చేసుకోవాలి

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Pocharam Project | పోచారం ప్రాజెక్ట్​ నుండి ప్రధాన కాలువలోకి 150 క్యూసెక్కుల నీటిని...

    Hyderabad | రోగిని ప్రేమించిన డాక్టర్.. చివరకు ఏమైందంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | రోగిని ప్రేమించిన ఓ డాక్టర్​.. ఆమె జీవితం విషాదంతం అయింది. మానసిక...