ePaper
More
    HomeFeaturesGoogle Pixel 10 | ఏడేళ్ల వరకు అప్‌డేట్స్.. గూగుల్‌ పిక్సెల్‌ 10 ప్రత్యేకతలివే..

    Google Pixel 10 | ఏడేళ్ల వరకు అప్‌డేట్స్.. గూగుల్‌ పిక్సెల్‌ 10 ప్రత్యేకతలివే..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Google Pixel 10 | ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న గూగుల్‌ పిక్సల్ 10 (Google Pixel 10) సిరీస్‌ స్మార్ట్‌ ఫోన్లు విడుదలయ్యాయి. మేడ్‌ బై గూగుల్‌ (Made by google) ఈవెంట్‌లో ఈ ఫోన్లను బుధవారం రాత్రి లాంచ్‌ చేసింది. ఇందులో పిక్సల్ 10, పిక్సల్‌ 10 ప్రో, పిక్సల్‌ 10 ప్రో ఎక్స్‌ఎల్‌ మోడల్స్‌ ఉన్నాయి. ఇవి గూగుల్‌ టెన్సార్‌ జీ5 చిప్‌, టైటాన్‌ ఎం2 సెక్యూరిటీ చిప్‌ను కలిగి ఉన్నాయి. పూర్తి స్పెసిఫికేషన్స్‌ ఇలా ఉన్నాయి.

    Display : 6.3 అంగుళాల ఫుల్‌ HD+ OLED సూపర్ అక్వా డిస్‌ప్లేతో వస్తున్న ఈ ఫోన్‌.. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 3000 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. డిస్‌ప్లే, వెనుక వైపు ప్యానల్‌ కూడా గొరిల్లా గ్లాస్ విక్టస్‌ 2 ప్రొటెక‌్షన్‌ అందించారు.
    IP68 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ ఇస్తుంది.

    చిప్‌సెట్ వివరాలు :పిక్సల్‌ 10 స్మార్ట్‌ఫోన్‌ 3nm టెన్సార్‌ G5 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. టైటాన్‌ M2 చిప్‌ను కూడా అమర్చారు. ఇది 12 GB ర్యామ్, 256 GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది.

    ఏడేళ్ల వరకు : ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
    ఏడేళ్లవరకు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందించనున్నట్లు కంపెనీ పేర్కొంది.

    బ్యాటరీ : 4970mAh బ్యాటరీ కలిగిన ఈ ఫోన్‌.. 30W ఫాస్ట్‌ చార్జింగ్తోపాటు 15W Qi2 వైర్‌లైస్ చార్జింగ్‌నూ సపోర్టు చేస్తుంది.
    ఇది వేపర్ కూలింగ్‌ చాంబర్‌ను కలిగి ఉంది.

    కెమెరా : ఈ ఫోన్‌ వెనక వైపు ట్రిపుల్‌ కెమెరా(Triple camera)లను అమర్చారు. 48 MP ప్రైమరీ కెమెరా, 5x జూమ్‌తో 10.8 MP టెలిఫొటో లెన్స్, 13 MP అల్ట్రావైడ్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ముందువైపు 10.5 MP కెమెరాను అమర్చారు. ఈ ఫోన్‌ పలు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత టూల్స్‌ను కలిగి ఉంది.

    ధర, సేల్ వివరాలు : గూగుల్‌ పిక్సల్‌ 10 స్మార్ట్‌ఫోన్ ఇండిగో, ప్రాస్ట్‌, లెమన్‌ గ్రాస్‌, ఒబ్సిడియన్‌ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.79,999. ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనుంది. ప్రీ బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. Card offers : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేసేవారికి రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌ లభించనుంది. ఫ్లిప్‌కార్డ్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌కార్డ్‌తో 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది.

    Latest articles

    Kamareddy Collector | మున్సిపాలిటీలో డ్రెయినేజీలు బ్లాక్ కాకుండా చర్యలు తీసుకోవాలి

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Collector | మున్సిపాలిటీలో ఎక్కడ కూడా డ్రెయినేజీలు బ్లాక్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని...

    Delhi CM | కుక్క‌ల కోసమే సీఎంపై దాడి చేసా.. నిందితుడు షాకింగ్ కామెంట్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :  Delhi CM | ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై దాడికి పాల్పడిన రాజేష్ ఖిమ్జీ...

    Nizamsagar Project | నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల

    అక్షరటుడే, నిజాంసాగర్ : Nizamsagar Project | నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ భాగం నుంచి దిగువకు నీటి విడుదల...

    Jagadeesh Reddy | క‌మీష‌న్ల కోస‌మే యూరియా కొర‌త‌.. కాంగ్రెస్ చేత‌గానిత‌నంతోనే రైతుల‌కు క‌ష్టాలన్న జ‌గ‌దీష్‌రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Jagadeesh Reddy | కాంగ్రెస్ ప్ర‌భుత్వ చేత‌గానితనంతోనే యూరియా కొర‌త ఏర్ప‌డింద‌ని మాజీ మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి...

    More like this

    Kamareddy Collector | మున్సిపాలిటీలో డ్రెయినేజీలు బ్లాక్ కాకుండా చర్యలు తీసుకోవాలి

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Collector | మున్సిపాలిటీలో ఎక్కడ కూడా డ్రెయినేజీలు బ్లాక్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని...

    Delhi CM | కుక్క‌ల కోసమే సీఎంపై దాడి చేసా.. నిందితుడు షాకింగ్ కామెంట్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :  Delhi CM | ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై దాడికి పాల్పడిన రాజేష్ ఖిమ్జీ...

    Nizamsagar Project | నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల

    అక్షరటుడే, నిజాంసాగర్ : Nizamsagar Project | నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ భాగం నుంచి దిగువకు నీటి విడుదల...