అక్షరటుడే, వెబ్డెస్క్: Upasana gives birth to twins | మెగా ఫ్యామిలీలో (Mega Family) ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ – ఉపాసన కొణిదెల (Ram Charan – Upasana) దంపతులకు కవల పిల్లలు జన్మించిన శుభవార్త అభిమానుల్లో ఆనందం రెట్టింపు చేసింది. జనవరి 31 శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో (Apollo Hospital Hyderabad) ఉపాసన ఓ బాబు, ఓ పాపకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించడం విశేషం. తల్లి, పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని, తమ కుటుంబంలోకి ఈ చిన్నారులు రావడం దైవానుగ్రహంగా భావిస్తున్నామని ఆయన వెల్లడించారు. “రామ్ చరణ్ – ఉపాసన కవలలకు జన్మనిచ్చారు. ఒక మగబిడ్డ, ఒక ఆడబిడ్డ (Upasana gives birth to twins) పుట్టినందుకు మేము ఎంతో ఆనందంతో కృతజ్ఞతాభావంతో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. తల్లి పిల్లలు క్షేమంగా ఉన్నారు.
Upasana gives birth to twins | సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ
తాతయ్య, నానమ్మలుగా ఈ చిన్నారులను మా కుటుంబంలోకి స్వాగతించడం మాకు అపార సంతోషాన్ని ఇస్తోంది. అందరి ప్రార్థనలు, ప్రేమ, ఆశీర్వాదాలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు” అంటూ చిరంజీవి–సురేఖ పేర్లతో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ ఊరుతోంది. ఇప్పటికే రామ్ చరణ్–ఉపాసన Upasana దంపతులకు క్లింకార అనే కుమార్తె ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు కవలలు పుట్టడంతో మెగా కుటుంబం మరింత పెద్దదైంది. ముఖ్యంగా వారసుడు పుట్టడంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత రెట్టింపైంది. గతంలో ఒక సినిమా ఈవెంట్లో ఇంట్లో అందరూ ఆడపిల్లలే ఉన్నారని సరదాగా వ్యాఖ్యానించిన చిరంజీవి, ఒక అబ్బాయి పుడితే బాగుంటుందని అన్న మాటలు ఇప్పుడు నిజమయ్యాయని అభిమానులు సోషల్ మీడియాలో గుర్తుచేస్తున్నారు.
రామ్ చరణ్ – ఉపాసనలు ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 2012 జూన్ 14న వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2023 జూన్ 20న క్లింకార Klinkaara పుట్టడంతో తల్లిదండ్రులైన ఈ జంట, ఇప్పుడు కవలలకు జన్మనివ్వడంతో తమ కుటుంబంలో ఆనందాన్ని రెట్టింపు చేసుకున్నారు. ట్విన్స్ రాకతో మెగా ఇంట సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతూ మెగా ఫ్యామిలీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
With immense joy and a heart full of gratitude, we are happy to share that @AlwaysRamCharan and @upasanakonidela have been blessed with twins – a baby boy and a baby girl.
Both the babies and the mother are healthy and doing well. ✨
Welcoming these little ones into our family…
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 31, 2026