అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Weather Updates | రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి వర్షం పడుతూనే ఉంది. రెండు రోజులుగా ముసురు పట్టడంతో వాతావరణం (Weather) చల్లబడింది. బుధవారం మధ్యాహ్నం వరకు కురిసిన వర్షం సాయంత్రం వరకు కాస్త తెరిపినిచ్చింది. మళ్లీ రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు వాన పడుతూనే ఉంది. అప్పుడప్పుడు భారీ వర్షం(Heavy Rain) పడి.. రోజంతా ముసురు వాన పడుతుండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు.
Weather Updates | ఆ జిల్లాలకు హెచ్చరికలు
రాష్ట్రంలోని ములుగు జిల్లా(Mulugu District)ల్లో బుధవారం రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైన విషయం తెలిసిందే. గురువారం కూడా ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు, కొత్తగూడం జిల్లా(Kothaguda Districts)ల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. మిగతా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ములుగు జిల్లాలో బుధవారం కురిసిన వర్షానికి బొగత జలపాతం (Bogatha Water Falls) పరవళ్లు తొక్కుతోంది.
Weather Updates | హైదరాబాద్‌లో.
హైదరాబాద్ (Hyderabad) నగరంలో గురువారం తెల్లవారుజామున నుంచే వర్షం పడుతోంది. తేలిక పాటి వర్షం మధ్యాహ్నం వరకు కురుస్తుందని అధికారులు తెలిపారు. వర్షంతో పలు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
Weather Updates | బెజ్జురులో రికార్డు వర్షపాతం
గత 24 గంటల్లో ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్‌లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు అయింది. ఏకంగా 237 మి.మీ వర్షం కురిసింది. ములుగులో 218 మి.మీ, కరీంనగర్ జిల్లా పోచంపల్లి 145, కరీంనగర్ 125, ములుగు జిల్లా మంగపేట్ 122, మల్లంపల్లి 118, కరీంనగర్ జిల్లా గంగిపల్లి 116, ఏటూరు నాగారం 112, ఆసిఫాబాద్ జిల్లా రవీంద్ర నగర్ 106 మి.మీ. వర్షం కురిసింది.