అక్షరటుడే, వెబ్‌డెస్క్ : UNO | దాయాది దేశం పాకిస్తాన్ pakistanకు ఐరాస uno భద్రతా మండలి చుక్కెదురైంది. పహల్గామ్ ఉగ్రదాడి pahalgam terror attack తర్వాత భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా భారత్ పాక్‌తో సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకొని ఆ దేశానికి నీరు వెళ్లకుండా ఆపేసింది. అయితే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో పాక్ ఉగ్రదాడి గురించి ప్రస్తావించకుండా సింధూ నది indus river జలాలను భారత్ ఆపిందని సమావేశంలో చెప్పింది. దీనిపై భద్రతా మండలిలోని దేశాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించాయి. ఈ సందర్భంగా పాకిస్థాన్ చెప్పిన పలు అంశాలను తిరస్కరించాయి. సమస్యను భారత్‌తో ద్వైపాక్షిక చర్చలతో పరిష్కరించుకోవాలని సూచించాయి.
UNO | పాక్‌పై ప్రశ్నల వర్షం
ఇటీవల పాక్ నేతల వ్యాఖ్యలను ఈ సందర్భంగా భద్రతామండలి సభ్యదేశాలు లేవనెత్తుతూ కీలక ప్రశ్నలు సంధించాయి. ఉగ్రదాడిలో లష్కరే తోయిబా Lashkar-e-Taiba ప్రమేయంపై పాక్‌ను ఐక్య రాజ్య సమితి ఆరా తీసింది. ప్రత్యేకంగా ఒక మతం పర్యాటకులనే కాల్చి చంపడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే పాక్ వరుసగా క్షిపణి పరీక్షలు missile test చేయడంపై కూడా ఐరాస ఆగ్రహం వ్యక్తం చేసింది. అణుదాడులకు సిద్ధమని ఇటీవల పలువురు పాక్ నేతలు మాట్లాడడంపై కూడా భద్రతా మండలిలోని దేశాలు నిలదీశాయి. గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో ఎలాంటి తీర్మానాలు చేయలేదు.