అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kubreshwar Dham Stampede | మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh) విషాదం చోటు చేసుకుంది. సెహోర్‌లోని కుబ్రేశ్వర్ ధామ్‌లో మంగళవారం తొక్కిసలాట చోటు చేసుకోగా.. ఇద్దరు భక్తులు మృతి చెందారు. పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా ఉత్తరాదిలో ఆలయాలకు భక్తులు భారీగా తరలి వస్తారు. ముఖ్యంగా కన్వర్ యాత్ర (Kanwar Yatra) చేపట్టి గంగా జలాలతో శివుడికి అభిషేకం చేస్తారు. ఈ క్రమంలో కుబ్రేశ్వర్ ధామ్‌లో పండిట్ ప్రదీప్ మిశ్రా కన్వర్ యాత్ర నిర్వహించనున్నారు. అయితే మంగళవారం ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది.
కుబ్రేశ్వర్ ధామ్ (Kubreshwar Dham) నుంచి చితావాలియా హేమా గ్రామం వరకు జరిగే కన్వర్ యాత్ర ఆగస్టు 6న ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం కోసం భక్తులు ఒక రోజు ముందుగానే ఆలయానికి రావడం ప్రారంభించారు. అధికారులు భక్తుల కోసం ఏర్పాట్లు చేశారు. అయితే అధికారులు అనుకున్నదానికంటే అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. భక్తులకు సౌకర్యాలు లేకపోవడం, భండార పంపిణీ, దర్శనం కోసం పరిమిత స్థలంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు భక్తులు (Devotees) మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Kubreshwar Dham Stampede | నాలుగు వేల మంది భక్తుల కోసం ఏర్పాట్లు
ధామ్ వద్ద 4 వేల మంది భక్తుల కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. నమక్ చౌరాహా, రాధేశ్యామ్ కాలనీ, బజరంగ్ అఖారా, అటల్ పార్క్, నగరంలోని ఇతర ప్రదేశాలలో నాలుగు వేలకు పైగా భక్తుల బస కోసం ఏర్పాట్లు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఒక రోజు ముందుగానే భారీ సంఖ్యలో భక్తులు రావడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తొక్కిసలాట (Stampede) జరగడానికి ముందు ఉన్నతాధికారులు ధామ్ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. వాహనాలను దారి మళ్లించాలని సూచించారు. అయితే అధికారుల సూచనలు అమలు కాలేదు.
కాగా.. ఇటీవల ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో గల మానసాదేవి ఆలయంలో కూడా తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మానస దేవి ఆలయానికి జులై 27న భారీగా భక్తులు (Huge Devotees) వచ్చారు. అయితే ప్రధాన ఆలయానికి వెళ్లే మెట్లపై ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. విద్యుత్ వైర్ తెగిపడడంతో షాక్ కొడుతుందని పుకారు వ్యాప్తి చెందడంతో భక్తులు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకోగా ఏడుగురు మృతి చెందారు. దాదాపు 55 మంది గాయపడ్డారు.