అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Movements and Protests | రెండు దేశాల్లో రగిలిన రెండు ఉద్యమాలు అక్కడి ప్రభుత్వాలను కుప్పకూల్చేశాయి. పాలకులను గద్దె దింపి ప్రాణభయంతో పారిపోయేలా చేశారు. బంగ్లాదేశ్ లో ఎగిసిన నిరసనల నేపథ్యంలో ఆగస్టు 5, 2024న అప్పటి ప్రధానమంత్రి షేక్ హసీనా (Sheikh Hasina) తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయారు.
ఇక, సెప్టెంబర్ 9, 2025న దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో నేపాల్ ప్రధానమంత్రి పదవికి కేపీ శర్మ ఓలి రాజీనామా (KP Sharma Oli resigned) చేశారు. ఆయన దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఏడాది వ్యవధిలో జరిగిన ఈ రెండు నిరసనలు భారతదేశానికి ఆనుకుని ఉనన దేశాల్లోనే జరుగడం గమనార్హం. అవినీతి, బంధుప్రీతితో రగిలిపోయిన పౌరులు, యువత రోడ్డెక్కడంతో ప్రభుత్వాలు పడిపోయాయి. ప్రస్తుతం నేపాల్ లో జరుగుతున్న విధ్వంసకాండ నేపథ్యంలో రెండు ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల (two anti-government movements) మధ్య ఉన్న సారూప్యతలను గమనించవచ్చు.
Movements and Protests | యువకులదే నాయకత్వం
బంగ్లాదేశ్‌లో (Bangladesh) ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించింది అక్కడి యువకులే. వివక్షకు వ్యతిరేకంగా యువకులు, విద్యార్థులు హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలకు నాయకత్వం వహించారు. ప్రభుత్వ అణచివేతను ధైర్యంగా ఎదుర్కొన్న అక్కడి యువత పాలన మార్పు కోసం తమ డిమాండ్‌తో ముందుకు సాగింది. చివరికి, వారు విజయం సాధించింది. ఇప్పుడు నేపాల్ నిరసనకు దిగిన వారు కూడా యువకులు, విద్యార్థులే కావడం విశేషం. తమను తాము జనరల్ జెడ్ అని పిలుచుకునే యువత సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడానికి వీధుల్లోకి వచ్చారు. ఈ ఉద్యమం తరువాత ప్రస్తుత పాలనకు వ్యతిరేకంగా పూర్తిస్థాయి ఆందోళనగా మారింది.
Movements and Protests | హక్కుల కోసం ఉద్యమ బాట..
బంగ్లాదేశ్ స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు రిజర్వేషన్లు కల్పించడం అక్కడి యువత ఆగ్రహానికి కారణమైంది. ఇది షేక్ హసీనా ప్రభుత్వానికి (Sheikh Hasina government) వ్యతిరేకంగా ఉద్యమానికి దారి తీసింది. రిజర్వేషన్ అన్యాయమని, తమకు ఉద్యోగాలు రావనే ఆవేదనతో గళమెత్తారు. అదే సమయంలో సుప్రీంకోర్టు (Suprem Court) ఇచ్చిన ఉత్తర్వు మరింత ఆగ్రహానికి దారితీసింది, చివరికి షేక్ హసీనాను పదవీచ్యుతురాలిని చేసింది.
ఇప్పుడు నేపాల్‌లో సోషల్ మీడియా నిషేధానికి (social Media Ban) వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసనలు అవినీతికి, రాజకీయ నాయకుల బంధుప్రీతికి వ్యతిరేకంగా మారాయి. తమ కుటుంబ సభ్యులు, బంధువులకే అవకాశాలు కల్పిస్తుండడంపై ఉద్యమంగా విస్తరించాయి. తమ జీవితలు దుర్భురమైన సమయంలో పాలకులు, ప్రభుత్వ అధికారులు విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నారని ఆగ్రహంతో ఉద్యమ బాట పట్టారు.
Movements and Protests | పని చేయని అణచివేత
బంగ్లాదేశ్‌లో ఆందోళనకారులను అణచివేసేందుకు షేక్ హసీనా ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది. బలగాలను రంగంలోకి దింపింది. ఈ క్రమంలో 1,500 మందికి పైగా నిరసనకారులు మరణించినా ఉద్యమం ఆగలేదు. పైగా అది దేశవ్యాప్తంగా వ్యాపించింది. అన్ని వర్గాల నుంచి మద్దతు లభించడం, నిరసనకారులు ప్రధాని నివాసాన్ని ముట్టడించారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రాణభయంతో దేశం వీడాల్సి వచ్చింది.
ఇప్పుడు నేపాల్ ప్రభుత్వం (Nepal government) కూడా నిరసనకారులపై ఉక్కుపాదం మోపాలని యత్నించింది. ఖాట్మండులో ప్రారంభమైన మొదటి నిరసనను అణిచివేయడానికి సైన్యం, అల్లర్ల పోలీసులు ప్రయత్నించారు. 19 మంది మృతి చెందగా, వందలాది మంది గాయపడడ్ారు. కానీ బల ప్రయోగం ఉద్యమాన్ని మరింత రగల్చింది. ఆందోళన ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. విధ్వంసం పెచ్చరిల్లడంతో ప్రధానమంత్రి రాజీనామా చేయక తప్పలేదు. చివరకు ఇప్పుడు ప్రాణభయంతో దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.