అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Nizamabad City | నగరంలో పలు చోరీలకు యత్నించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు వన్ టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి (SHO Raghupathi) తెలిపారు. ఈ మేరకు శనివారం వన్‌టౌన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇటీవల నగరంలో చేసుకున్న దుకాణాల షట్టర్ లిఫ్టింగ్ ఘటనలకు సంబంధించి కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఈ క్రమంలో సీసీ పుటేజీలు (CCTV footage), సాంకేతిక ఆధారాలు, ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా నిందితుల కోసం వేట కొనసాగించామన్నారు.
పక్కా సమాచారం మేరకు కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం (Tadwai mandal) కంకల్ గ్రామానికి చెందిన శ్రీకాంత్, తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన బొండి తరుణ్‌లను అదుపులోకి తీసుకున్నామన్నారు. అనంతరం వీరిని న్యాయస్థానం ఎదుట హాజరు పర్చగా వీరిని జ్యూడిషియల్ కస్టడీకి అప్పగించినట్లు తెలిపారు. నగరంలో రాత్రివేళల్లో నిత్యం పెట్రోలింగ్ చేస్తున్నామన్నారు. ఎక్కడైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.