అక్షరటుడే, ఇందూరు: Turmeric Farmers Protest | నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు రైతులు (Turmeric Farmers) గురువారం ఆందోళన నిర్వహించారు. పసుపు కొనుగోలులో జాప్యం జరుగుతుందంటూ కార్యాలయాన్ని ముట్టడించారు.
Turmeric Farmers Protest | సాఫ్ట్వేర్ అప్డేట్ పేరుతో..
సాఫ్ట్వేర్ అప్డేట్ పేరుతో రెండురోజులుగా మార్కెట్లో క్రయవిక్రయాలు జరపట్లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అనవసరంగా కాలయాపన చేస్తున్నారని, అధికారుల నిర్లక్ష్యం కారణంగా తాము యార్డులోనే పడిగాపులు కాస్తున్నామంటూ అధికారులపై మండిపడ్డారు. ఒక దశలో కార్యాలయ తలుపులు అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రైతులను సముదాయించారు. అధికారులతో మాట్లాడారు.
నిజామాబాద్ మొదటిస్థానం..
దేశంలోనే అత్యధికంగా పసుపు పండే జిల్లాలో నిజామాబాద్ (Nizamabad)మొదటి స్థానంలో ఉంటుంది. జాతీయ పసుపు బోర్డు కూడా నిజామాబాదులోనే నెలకొల్పారు. దీంతో మహారాష్ట్రలోని సాంగ్లీతో పాటు నిజామాబాద్ మార్కెట్ యార్డు (Nizamabad Market Yard)కు భారీగా పసుపును తీసుకొస్తారు. సాధారణంగా ప్రభుత్వం పసుపు కొనుగోలును ‘ఈ నామ్’ యాప్ ద్వారా చేస్తుంది. ఆన్లైన్ ప్రక్రియలో భాగంగా స్లాట్ బుక్ చేసి కమిషన్ ఏజెంట్లకు అందజేస్తుంది.

