అక్షరటుడే, తిరుమల: తిరుమల దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ (Anil Kumar Singhal) బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ముద్దాడ రవిచంద్రకు టీటీడీ ఈవోగా (TTD EO) అదనపు బాధ్యతలను అప్పజెప్పింది. జీఏడీలో రిపోర్టు చేయాలని సింఘాల్‌ను ఆదేశించింది. ముద్దాడ రవిచంద్ర ప్రస్తుతం సీఎం కార్యాలయం ముఖ్యకార్యదర్శిగా ఉన్న విషయం తెలిసిందే.
TTD EO | బదిలీ కారణం అదేనా..
తిరుమల లడ్డూ (Tirumala laddu) కల్తీ నెయ్యి వ్యవహారంలో సింఘాల్‌ను బదిలీ చేయాలని సిట్ లేఖ రాసి నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసున్నట్లు సమాచారం. గత ప్రభుత్వంలోనూ అనిల్ కుమార్ సింఘాల్ ఈవోగా పనిచేశారు. అయితే ఆ సమయంలో లడ్డూలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగినట్లు ఆరోపణలు రావడంతో కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.
TTD EO | వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో..
సిట్ సభ్యులపై వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీకోర్టును (Supreme Court) ఆశ్రయించారు. సీబీఐ నేతృత్వంలోని సిట్‌ను నియమించాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీబీఐ ఆధ్వర్యంలో నియామకమైన సిట్ సభ్యులు పలు కోణాల్లో విచారణ నిర్వహించారు. విచారణ పూర్తవడంతో కోర్టుకు నివేదిక అందించారు. లడ్డూలో జంతువుల అవశేషాలు కలవలేదని, కానీ కల్తీ జరిగినట్లు నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. అలాగే అప్పటి టీటీడీ అధికారులపై చర్యలు చేపట్టాలని.. అలాగే ఈవోను బదిలీ చేయాలని సూచించింది. ఈ మేరకు ప్రభుత్వం అనిల్ కుమార్ సింఘాలను ప్రభుత్వం బదిలీ చేసినట్లు తెలుస్తోంది.