అక్షరటుడే, వెబ్‌డెస్క్: US president | భారత్ – పాకిస్తాన్ (india-pakistan) మధ్య కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (US president donald trump) మరోసారి స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ (social media post) పెట్టారు.
భారత్ – పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ శనివారం సాయంత్రం ఎక్స్‌లో పోస్ట్ (trump twitter post) చేసిన విషయం తెలిసిందే. అనంతరం భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ (indian foreign secretary vikram misri) సైతం ఇదే విషయాన్ని వెల్లడించారు.
పాకిస్తాన్ ఆర్మీ జనరల్ (pakistani army general), భారత ఆర్మీ జనరల్‌కు (indian army general) ఫోన్ చేసి మాట్లాడటంతో కాల్పుల విరమణకు అంగీకరించామని ఆయన ప్రకటించారు. అయితే తమ చొరవతోనే కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ చారిత్రక నిర్ణయానికి అమెరికా సాయపడటం గర్వంగా ఉందని ఆయన పోస్ట్ చేశారు. కాల్పులు విరమించకపోతే లక్షలాది మంది మరణించేవారని ట్రంప్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్‌లో భారత్, పాకిస్తాన్‌తో (india – pakistan) వ్యాపారాన్ని గణనీయంగా పెంచుకుంటామని ట్రంప్ ప్రకటించారు.
భారత్, పాక్ బలమైన నాయకత్వాల పట్ల గర్వపడుతున్నట్లు పేర్కొన్నారు. వెయ్యేళ్ల తర్వాతైనా కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభిస్తుందేమో.. పరిశీలించేందుకు కృషి చేస్తా అని ట్రంప్ (donald trump) అన్నారు. కాగా భారత్ ఆది నుంచి కశ్మీర్ (kashmir) విషయంలో మూడో దేశం ప్రమేయం అవసరం లేదని వాదిస్తోంది. ఇది తమ రెండు దేశాలకు సంబంధించిన అంశమని తామే తేల్చుకుంటామని చెబుతోంది. అయితే ట్రంప్ మాత్రం కశ్మీర్ సమస్యపై (kashmir issue) స్పందించడం గమనార్హం.