HomeతెలంగాణH1B Visa | హెచ్​1బీ వీసాలపై ట్రంప్​ నిర్ణయంతో తెలంగాణకు తీవ్ర నష్టం : ఐటీ...

H1B Visa | హెచ్​1బీ వీసాలపై ట్రంప్​ నిర్ణయంతో తెలంగాణకు తీవ్ర నష్టం : ఐటీ మంత్రి శ్రీధర్​బాబు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : H1B Visa | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్ (Donald Trump)​ హెచ్​1బీ వీసాల దరఖాస్తు ఫీజును భారీగా పెంచిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్​బాబు (Sridhar Babu) స్పందించారు.

వీసా దరఖాస్తు ఫీజు పెంపు నిర్ణయాన్ని ఆయన ఖండించారు. ఇది తెలుగు రాష్ట్రాల ప్రజలకు నష్టం చేస్తుందన్నారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఎంతో మంది అమెరికాలో నివసిస్తున్నారని ఆయన చెప్పారు. అలాంటి వారికి ట్రంప్​ నిర్ణయంతో నష్టం వాటిల్లుతుందని మంత్రి పేర్కొన్నారు. అమెరికా విధానాలు భారతదేశాన్ని, అక్కడ పనిచేస్తున్న చిన్న వ్యాపారాలను దెబ్బ తీసేలా ఉన్నాయన్నారు.

H1B Visa | అగ్రస్థానంలో భారత్​

హెచ్​1బీ వీసాలు పొందడంలో భారత్​ మొదటి స్థానంలో ఉందని మంత్రి తెలిపారు. తెలంగాణకు చెందిన చాలా మంది అమెరికాలో నివసిస్తున్నారని చెప్పారు. వారు పంపించే డబ్బుతో ఇక్కడి వారు కుటుంబాలు జీవిస్తున్నాయన్నారు. అమెరికాలో టీసీఎస్ (TCS)​లో లక్ష మంది, విప్రో 80 వేలు, ఇన్ఫోసిస్ 60 వేల భారతీయులు పని చేస్తున్నారని చెప్పారు. ట్రంప్​ తాజా నిర్ణయంతో వారందరు ఇబ్బందులు పడుతారన్నారు.

H1B Visa | కేంద్రంపై ఆగ్రహం

మంత్రి శ్రీధర్​బాబు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా నిర్ణయాలతో భారత పౌరులకు, దేశానికి నష్టం వాటిల్లుతున్నా కేంద్రం ఎందుకు మౌనంగా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే అమెరికాతో చర్చలు జరపాలని డిమాండ్​ చేశారు. అంతమొత్తంలో దరఖాస్తు రుసుము వసూలు చేస్తే అమెరికాలోని భారతీయ కంపెనీలకు (Indian Companies) భారీ నష్టాలు వస్తాయన్నారు. దేశానికి సైతం ఇది తీవ్ర నష్టం చేకూరుస్తుందని ఆయన పేర్కొన్నారు. ట్రంప్​ ఎప్పుడు ఏం చేస్తారో ఆయన మిత్రుడు మోదీ (Modi)కి బాగా తెలుసని శ్రీధర్​బాబు ఎద్దేవా చేశారు. దీనిపై మోదీ స్పందించాలని కోరారు.