HomeUncategorizedPavan Kalyan | దసరా తర్వాత త్రిశూల్‌ కార్యక్రమం.. డిప్యూటీ సీఎం పవన్​ కీలక వ్యాఖ్యలు

Pavan Kalyan | దసరా తర్వాత త్రిశూల్‌ కార్యక్రమం.. డిప్యూటీ సీఎం పవన్​ కీలక వ్యాఖ్యలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | రాజకీయాలు డబ్బు సంపాదించడం కోసం కాదని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ అన్నారు. విశాఖపట్నం (Visakhapatnam)లో శనివారం రెండో రోజు నిర్వహించిన సేనతో సేనాని కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

జనసేనలోకి (Janasena) వచ్చే వారు పదవుల కోసం కాకుండా.. దేశం, సంస్కృతి గురించి ఆలోచించాలన్నారు. దసరా తర్వాత పార్టీలో త్రిశూల్​ కార్యక్రమం చేపడుతామని పవన్​ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా క్రియశీల సభ్యులకు ప్రత్యేక ఐడీ ఇస్తామని చెప్పారు. వారికి పార్టీ నేతలు, కమిటీతో అనుసంధానం ఉంటుందన్నారు.

Pavan Kalyan | సినిమాలపై దృష్టి పెట్టలే..

పదేళ్లలో సినిమాలపై దృష్టి పెట్టలేకపోయానని పవన్​ పేర్కొన్నారు. పార్టీతోనే కొనసాగడంతో రికార్డు విజయం సాధించినట్లు చెప్పారు. కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడగలనని ఆయన అన్నారు. జనసేన కుటుంబ కోసం పెట్టిన పార్టీ కాదన్నారు. ఇకపై పార్టీని తానే ఆఫీస్‌ నుంచి మానిటర్‌ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఐడియాలజీ ఉండాలి.. అదే సమయంలో వ్యూహాలుండాలని ఆయన పేర్కొన్నారు.

Pavan Kalyan | కర్ణాటక జెండా పట్టుకున్న పవన్​

ఈ కార్యక్రమానికి కర్ణాటక నుంచి కూడా అభిమానులు తరలి వచ్చారు. జనసేన జెండాతో పాటు అభిమానులు తెచ్చిన కర్ణాటక రాష్ట్ర జెండాను సైతం పవన్​ పట్టుకున్నారు. మీటింగ్​లో శుక్రవారం ఆయన జనసేన జాతీయ పార్టీగా ఎదుగుతుందని చెప్పారు. ఈ క్రమలో కర్ణాటక జెండా పట్టుకోవడం గమనార్హం. ఆయన మాట్లాడుతూ.. కుటుంబం, సినిమాల కంటే పార్టీకే ప్రాధాన్యం ఇచ్చినట్లు పవన్​ తెలిపారు. 11 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో కష్టాలు ఎదురైనా తట్టుకుని నిలబడ్డానని చెప్పారు.

Must Read
Related News