- Advertisement -
HomeUncategorizedSrinagar Jamia Masjid | వేర్పాటువాదుల అడ్డాలో పహల్​గామ్​​ మృతులకు నివాళులు

Srinagar Jamia Masjid | వేర్పాటువాదుల అడ్డాలో పహల్​గామ్​​ మృతులకు నివాళులు

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: Srinagar Jamia Masjid : పహల్​గామ్​లో ముష్కరుల దుశ్చర్యను జమ్మూకశ్మీర్ లో ముస్లింలు సైతం నిరసిస్తున్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ గొంతెత్తుతున్నారు. చనిపోయిన వారికి నివాళులర్పిస్తున్నారు. తమకు అపఖ్యాతిని మూటగట్టిన ఉగ్రమూకలపై చర్యలు తీసుకోవాల్సని డిమాండ్ చేస్తున్నారు. శ్రీనగర్​లోని చారిత్రాత్మక జామియా మసీదు వద్ద శుక్రవారం జరిగిన జుమ్మా సామూహిక ప్రార్థనల సందర్భంగా.. పహల్​గామ్​ ఉగ్రవాద మృతులకు ముస్లింలు ఒక నిమిషం మౌనం పాటించి నివాళులర్పించారు.

జమ్మూకశ్మీర్‌లో ఈ జామియా మసీదు వేర్పాటువాదులకు కేంద్రంగా ఉంది. అలాంటి ప్రార్థనా మందిరంలో ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించడం గమనార్హం. హురియత్ కాన్ఫరెన్స్ నాయకుడు, ముస్లిం మత నాయకుడు మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ నాలుగు వారాల తర్వాత జామియా మసీదును శుక్రవారం సందర్శించి ప్రసంగించారు. ఆయన పహల్​గామ్​ మృతులకు నివాళులర్పించిన అనంతరం మాట్లాడారు.

- Advertisement -

UAPA కింద కేంద్ర ప్రభుత్వం నిషేధించిన అవామీ యాక్షన్ కమిటీ (AAC) పహల్​గామ్​లో యాత్రికులపై దాడి చేయడాన్ని మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ ఖండించారు. “ఈ మారణహోమం ఎలా జరిగింది..? రెండు డజన్లకు పైగా ప్రజలు చంపబడ్డటం దిగ్భ్రాంతికరమైనది.. నమ్మశక్యం కానిది. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.” అని అన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News