Mathura Car Canal Accident | కాలువలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు యువకుల మృతి

అక్షరటుడే, వెబ్​డెస్క్: Mathura Car Canal Accident | ఉత్తర ప్రదేశ్​ (Uttar Pradesh)లోని మధురలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. ఓ కారు కాలువలోకి దూసుకెళ్లగా నలుగురు యువకులు మృతి చెందారు. మధుర జిల్లా (Mathura District)లో బుధవారం రాత్రి ఓ కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మగోర్రా పోలీస్ స్టేషన్ (Magorra Police Station) ప్రాంతంలోని నాగల దేవియ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Mathura Car Canal Accident | ఉత్తర ప్రదేశ్​ (Uttar Pradesh)లోని మధురలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. ఓ కారు కాలువలోకి దూసుకెళ్లగా నలుగురు యువకులు మృతి చెందారు.

మధుర జిల్లా (Mathura District)లో బుధవారం రాత్రి ఓ కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మగోర్రా పోలీస్ స్టేషన్ (Magorra Police Station) ప్రాంతంలోని నాగల దేవియ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడ ప్రమాదకరమైన మలుపు, భద్రతా చర్యలు లేకపోవడం ప్రమాదానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనలో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కారును కాలువ నుంచి క్రేన్​ సాయంతో బయటకు తీశారు.

Mathura Car Canal Accident | రాజస్థాన్​ వెళ్తుండగా..

మహావన్ పట్టణంలోని బల్దేవ్ ఘర్ ప్రాంతం (Baldevgarh Area)లో నివసించే రాహుల్ (23), అతని బంధువులు మోహిత్ (21), అమిత్ (23), ఒక స్నేహితుడితో కలిసి రాజస్థాన్‌లోని డీగ్ జిల్లాలో నిశ్చితార్థ వేడుకకు హాజరు కావడానికి గోవర్ధన్ మీదుగా కారులో ప్రయాణిస్తున్నారు. అమిత్ కారు నడుపుతున్నాడు. రాత్రి కావడం, ప్రమాదకరమైన మలుపు వద్ద హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో , డ్రైవర్ ముందున్న కాలువను గమనించలేకపోయాడు. దీంతో కారు నీటిలో మునిగిపోయింది.
ప్రమాద స్థలంలో స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు లేవని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గతంలో సైతం ఇక్కడ ప్రమాదాలు జరిగాయని పేర్కొన్నారు. గ్రామస్తులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని యువకులను కారులో నుంచి బయటకు తీశారు. అయితే వారు అప్పటికే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...