Homeటెక్నాలజీChat GPT | తెగ వాడేస్తున్నారు.. చాట్‌ జీపీటీ వినియోగంలో భారత్‌ నంబర్‌ 1

Chat GPT | తెగ వాడేస్తున్నారు.. చాట్‌ జీపీటీ వినియోగంలో భారత్‌ నంబర్‌ 1

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​:Chat GPT | చాట్‌ జీపీటీ(CHAT GPT)ని మనోళ్లు తెగ వాడేస్తున్నారు. ఎంతలా అంటే ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచేలా.. చాట్‌జీపీటీ యూజర్లలో 13.5 శాతం భారతీయులే(Indians) కావడం గమనార్హం. దేశంలో దీనిని వినియోగించేవారి సంఖ్య 10.8 కోట్లకు చేరింది. 8.9 శాతంతో ఆ తర్వాతి స్థానంలో అమెరికా(America) ఉంది.

ఏఐ ఆధారిత ఈ చాట్‌బాట్‌(Chat bot)ను సాంకేతిక నిపుణులతోపాటు సామాన్యులూ వినియోగిస్తున్నారు. కావాల్సిన సమాచారాన్ని సేకరించడం, కంటెంట్‌ క్రియేషన్(Content creation).. ఇలా ఏ అవసరం ఉన్నా చాట్‌ జీపీటీ సాయం తీసుకుంటున్నారు. నేర్చుకోవడానికి, రాయడానికి, కోడింగ్‌(Coding) కోసం కూడా ఉపయోగిస్తున్నారు. ఇది మనకు కావాల్సిన సమాచారాన్ని తెలుగు(Telugu)లోనూ అందిస్తోంది. తెలుగుతోపాటు హిందీ, మలయాళం, తమిళం వంటి అనేక భారతీయ భాషలను సపోర్ట్‌ చేస్తోంది.

అమెరికన్ కంపెనీ రూపొందించిన ఈ చాట్‌బాట్‌ భారత్‌లో వేగంగా విస్తరిస్తోందని వెంచర్‌ క్యాపిటలిస్ట్‌ మేరీ మీకర్‌ తన ‘2025 ఏఐ ట్రెండ్స్‌’ నివేదికలో తెలిపారు. డెస్క్‌టైమ్‌ అధ్యయనం ప్రకారం 92.2 శాతం భారతీయ కార్యాలయాలు తమ రోజువారీ కార్యకలాపాలలో చాట్‌జీపీటీ వినియోగానికి అనుమతించాయి. చాట్‌జీపీటీని స్వీకరించడంలో అమెరికా కంటే భారత్‌ చాలా ముందుంది. యూఎస్‌(US) కార్యాలయాలలో 72.2 శాతం మాత్రమే చాట్‌జీపీటీని ఉపయోగిస్తున్నాయి.

Chat GPT | రోజుకు 100 కోట్లకుపైగా..

చాట్‌ జీపీటీ 2022 నవంబర్‌ 30న అందుబాటులోకి వచ్చింది. వేగంగా ప్రజాదరణను చూరగొంది. ప్రస్తుతం చాట్‌జీపీటీ వేదికగా రోజుకు 100 కోట్లకుపైగా సెర్చెస్‌(Searches) నమోదవుతున్నాయట. వార్షిక సర్చెస్‌ 36,500 కోట్లకు చేరుకోవడానికి గూగుల్‌(Google)కు 11 ఏళ్లు పడితే.. చాట్‌జీపీటీ ఈ మైలురాయిని రెండేళ్లలోనే అందుకోగలగడం గమనార్హం.

Chat GPT | డీప్‌ సీక్‌నూ వదలడం లేదు..

చైనా తయారీ ఏఐ చాట్‌బాట్‌ ‘డీప్‌ సీక్‌’(Deep Seak) వినియోగంలోనూ భారతీయులు మూడో స్థానం(Third place)లో ఉన్నారు. దీనిని వినియోగించేవారిలో 6.9 శాతం మంది భారతీయులే.. 33.9 శాతం వాటాతో చైనా, 9.2 శాతంతో రష్యా టాప్‌ 2లో ఉన్నాయి.