అక్షరటుడే, వెబ్‌డెస్క్ : DGP Shivadhar Reddy | గ్రూప్–1 ఉద్యోగం సాధించిన డీఎస్పీలకు శిక్షణ ప్రారంభం అయింది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) గ్రూప్ –1 నియామక పత్రాలు అందించిన విషయం తెలిసిందే. ఇందులో 115 మంది డీఎస్పీలుగా ఎంపికయ్యారు.
కొత్తగా ఎంపికైన డీఎస్పీలకు రాజేంద్రనగర్‌లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో పది నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణను గురువారం డీజీపీ శివధర్‌రెడ్డి (Shivadhar Reddy) ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. 115 మందితో ఇప్పటి వరకు ఇదే పెద్ద బ్యాచ్ అని ఆయన పేర్కొన్నారు. శిక్షణ కాలంలో 10 నెలలపాటు చాలా కష్టంగా ఉంటుందన్నారు. అన్నింటిని ఎదుర్కొని విధులు నిర్వర్తించడానికి సిద్ధం కావాలన్నారు.
DGP Shivadhar Reddy | ఆదర్శంగా నిలవాలి
ఉదయం తెలంగాణ పోలీస్ అకాడమీ (Telangana Police Academy)కి చేరుకున్న ఆయనకు టీజీపీఏ డైరెక్టర్ అభిలాష బిస్త్ స్వాగతం పలికారు. కొత్తగా ఉద్యోగాలు సాధించిన వారు పోలీస్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజల హృదయాలు గెలుచుకోవాలని సూచించారు. డీఎస్పీలుగా చాలా మంది మహిళలు ఉద్యోగాలు సాధించారు. వారు వచ్చే తరానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఇంటెగ్రిటీ, ఎంపథీ, ప్రొఫెషనల్ ఎక్స్‌లెన్స్ అంశాలను గుర్తుంచుకోవాలన్నారు. ఈ బ్యాచ్ డీఎస్పీలు శిక్షణ (DSP Training) ముగిసిన తర్వాత కూడా కాంటాక్ట్‌లో ఉండాలన్నారు.
