అక్షరటుడే, వెబ్‌డెస్క్: Train Accident | బీహార్‌లో (Bihar) ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక గూడ్స్ రైలుకు (goods train) చెందిన 19 బోగీలు పట్టాలు తప్పాయి. వాటిలో 10 బోగీలు బరువా నదిలో పడిపోయాయి.
జసిడిహ్ నుంచి ఝాఝాకు సిమెంట్ లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు శనివారం అర్ధరాత్రి సిముల్తలా-టెల్వా హాల్ట్ (Simulthala-Telwa Halt) వద్ద బరువా నది వంతెన సమీపంలో పట్టాలు తప్పింది. దానిలోని 42 బోగీలలో 19 పట్టాలు తప్పగా, వాటిలో 10 బోగీలు నదిలో పడిపోయాయి. ఈ ఘటనతో రెండు లైన్లలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
Train Accident | రైళ్లపై ప్రభావం
జముయి జిల్లా సమీపంలో జరిగిన ఈ ప్రమాదం అనేక రైళ్ల రాకపోకలపై ప్రభావం చూపింది. తూర్పు రైల్వే అసన్సోల్ డివిజన్లోని (Eastern Railway Asansol division) జసిడిహ్-ఝఝఝ ప్రధాన మార్గంలో సిమెంట్ తీసుకెళ్తున్న సరుకు రవాణా రైలు పట్టాలు తప్పింది. బతువా నదిపై ఉన్న వంతెన నంబర్ 676పై ఈ ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలులోని డజను వ్యాగన్లు ఒకదానికొకటి ఢీకొని ట్రాక్‌పై పడిపోయాయి. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ట్రాక్‌పై వ్యాగన్లు పడిపోవడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. అనేక రైళ్లు స్టేషన్లలో నిలిచిపోయాయి. ఉదయం వరకు కోచ్‌లను తొలగించి రాకపోకలను అధికారులు పునరుద్ధరించారు.
Train Accident | ప్రయాణికుల ఇబ్బందులు
ఈ రైలు ప్రమాదం బీహార్‌లో వేలాది మంది ప్రయాణికుల ఇబ్బందులను పెంచింది. హౌరా-పాట్నా, హౌరా-ముజఫర్‌పూర్ రైలు మార్గాలపై కార్యకలాపాలు కూడా ప్రభావితమయ్యాయి. రైల్వేలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రైళ్లను నడుపుతున్నాయి. ముజఫర్‌పూర్ నుంచి హౌరాకు బయలుదేరాల్సిన బాగ్ ఎక్స్‌ప్రెస్‌ను బరౌని నుంచి దారి మళ్లించారు. 16 స్టేషన్లలో రైలు రద్దు చేయబడింది. ముజఫర్‌పూర్‌కు రావాల్సిన 13019 బాగ్ ఎక్స్‌ప్రెస్ ఆండాల్, కియుల్ మధ్య రద్దు అయింది. దీంతో చిత్తరంజన్, మధుపూర్, జాసిదిహ్లలో రైలు కోసం వేచి ఉన్న ప్రయాణికులు రాత్రంతా స్టేషన్లో పడిగాపులు కాశారు.