Homeజిల్లాలుజగిత్యాలkorutla | కోరుట్లలో విషాదం.. కరెంట్​ షాక్​తో ఇద్దరి మృతి

korutla | కోరుట్లలో విషాదం.. కరెంట్​ షాక్​తో ఇద్దరి మృతి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : korutla | జగిత్యాల జిల్లా (Jagtial district) కోరుట్లలో విషాదం చోటు చేసుకుంది. వినాయక విగ్రహాల తయారీ కేంద్రం వద్ద కరెంట్​ షాక్​ (electric shock) తగిలి ఇద్దరు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అల్వాల వినోద్​, బంటి సాయి అనే ఇద్దరు కోరుట్ల పట్టణ శివారులో వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు. అయితే షెడ్డులో ఉన్న విగ్రహాలు తడిగా ఉండటంతో ఆదివారం పక్కనే ఉన్న మరో షెడ్డులోకి మార్చాలని నిర్ణయించారు. ఈ క్రమంలో విద్యుత్​ తీగలకు వినాయక విగ్రహం తగలడంతో అల్వాల వినోద్​, బంటి సాయి మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Must Read
Related News