అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sirgaon Sridevi temple : గోవాలో దారుణం చోటుచేసుకుంది. శిర్గావ్లోని శ్రీదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఆలయంలో జాతర జరుగుతుండగా శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. 30 మందికి పైగా గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
గోవా జిల్లా మపుసాలోని గోవా మెడికల్ కాలేజ్ (మపుసాలోని స్టె హాస్పిటల్) Goa Medical College (Ste Hospital in Mapusa)లో గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితిని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ Goa Chief Minister Pramod సమీక్షించారు.
ఆలయంలో శతాబ్దాల నాటి ఆచారాన్ని వీక్షించేందుకు వేలాది మంది భక్తులు తరలిరావడంతో ఈ తొక్కిసలాట జరిగింది. ఇక్కడ పాదరక్షలు లేని ‘ధోండ్లు’ భగభగ మండే నిప్పుల మీదుగా నడుస్తారు.