అక్షరటుడే, వెబ్‌డెస్క్: Trade Deal Boosts Markets | భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ చేసిన ప్రకటన ఇన్వెస్టర్లలో జోష్ తీసుకువచ్చింది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్ (domestic stock market) మంగళవారం భారీ లాభాలతో ముగిసింది. మంగళవారం ఉదయం సెన్సెక్స్ 3,657 పాయింట్ల లాభంతో మరో 54 పాయింట్లు పెరిగింది.
గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్‌తో 2,370 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 1,220 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 33 పాయింట్లు పైకి ఎగబాకింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 700 పాయింట్లు పతనమైంది. చివరికి సెన్సెక్స్ 2,072 పాయింట్ల లాభంతో 83,739 వద్ద, నిఫ్టీ 639 పాయింట్ల లాభంతో 25,727 వద్ద స్థిరపడ్డాయి. యూఎస్ సుంకాల (US tariffs) తగ్గింపు, రూపాయి విలువ బలపడడం, క్రూడ్ ఆయిల్ ధర దిగిరావడం వంటి కారణాలతో మార్కెట్లు రాణించాయి.
Trade Deal Boosts Markets | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎసఈలో నమోదైన కంపెనీలలో 3,304 కంపెనీలు లాభపడగా 981 స్టాక్స్ నష్టపోయాయి. 137 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 121 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 117 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 11 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 10 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. బీఎసఈలో నమోదైన కంపెనీల సంపద విలువ 12.74 లక్షల కోట్ల మేర పెరిగింది.
Trade Deal Boosts Markets | అన్ని రంగాల్లో దూకుడు..
పవర్, క్యాపి{ల్ గూడ్స్, రియాలిటీ, ఇండస్ట్రియల్, యుటిలిటీ, ఫార్మా, ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్, కన్జూమర్ డ్యూరెబుల్, ఆటో, ఐటీ, టెలికాం, మెటల్ రంగాల షేర్లు భారీగా లాభపడ్డాయి.
Trade Deal Boosts Markets | Top gainers..
బీఎసఈ సెన్సెక్స్‌లో 28 స్టాక్స్ లాభాలతో, 2 స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. అదానిపోర్ట్స్ 9.12 శాతం, బజాజ్ ఫైనాన్స్ 6.68 శాతం, ఇండిగో 5.51 శాతం, పవర్‌గ్రిడ్ 4.85 శాతం, సన్‌ఫార్మా 4.63 శాతం లాభపడ్డాయి.
Losers..
టెక్ మహీంద్రా 0.57 శాతం, బీఈఎల్ 0.02 శాతం నష్టపోయాయి.