ePaper
More
    Homeఅంతర్జాతీయంTourist visa | గ‌ట్టిగా పిండుతున్న ట్రంప్.. వెయ్యి డాల‌ర్స్ చెల్లిస్తే వేగంగా వీసా ఇంట‌ర్వ్యూలు

    Tourist visa | గ‌ట్టిగా పిండుతున్న ట్రంప్.. వెయ్యి డాల‌ర్స్ చెల్లిస్తే వేగంగా వీసా ఇంట‌ర్వ్యూలు

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tourist visa | ట్రంప్ 2.0 పాలన(Trump 2.0 regime) సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది. మొదటి రోజు నుంచే చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న డొనాల్డ్ ట్రంప్(Donald Trump).. అమెరికా పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్.. అమెరికా పౌరసత్వం, వీసా నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ అంద‌రి గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తున్నాడు. అమెరికాలో పుట్టే పిల్లలకు పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు ప్రయత్నాలు చేసి.. ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించాడు ట్రంప్.. కొత్తగా కొన్ని రోజుల క్రితం గోల్డ్ కార్డును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. డబ్బులు చెల్లించి నేరుగా అమెరికా పౌరసత్వం పొందడమే ఈ గోల్డ్ కార్డు పౌరసత్వం. 5 మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే భారత కరెన్సీ(Indian currency)లో ఏకంగా రూ.43.5 కోట్లు చెల్లించి ఈ గోల్డ్ కార్డు కొనుగోలు చేసిన వారికి నేరుగా అమెరికా పౌరసత్వం(US citizenship) కల్పించనున్నారు.

    Tourist visa | భ‌యం.. భ‌యం

    ఇక ఇప్పుడు పర్యాటకులు, నాన్‌-ఇమ్మిగ్రెంట్‌ వీసా(non-immigrant visa) దరఖాస్తుదారులు వేగంగా వీసా ఇంటర్వ్యూకు హాజరు కావాలనుకొంటే వారి నుంచి వెయ్యి డాలర్లు వసూలు చేయాలనే ప్రతిపాదన అమలును ట్రంప్‌ ప్రభుత్వం(Trump administration) పరిశీలిస్తున్నది. త్వరితగతిన ఇంటర్వ్యూలు నిర్వహించడం కోసం ధర పెంచితే న్యాయపరమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో యూఎస్ అధికారులు United States officials ఈ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇది ప్రస్తుత వీసా దరఖాస్తు, ఇంటర్వ్యూ ప్రక్రియల్లో ఎటువంటి మార్పును చేయబోదు. కేవలం సుదీర్ఘకాల నిరీక్షణను మాత్రమే తప్పిస్తుందని మెమోలో స్పష్టం చేశారు. ప్రస్తుతం పర్యాటకులు, నాన్‌ ఇమిగ్రెంట్‌ వీసాదారులు ప్రాసెసింగ్‌ ఫీజు కింద 185 డాలర్లను చెల్లిస్తున్నారు. దీనికి అదనంగా ప్రీమియం ప్రాసెసింగ్‌ ఫీజును ఏర్పాటు చేస్తున్నారు.

    విదేశీ విద్యార్థుల(foreign students)కు వీసాలు మంజూరు చేయడానికి ముందు వారి సోషల్ మీడియా ఖాతాలు తనిఖీ చేస్తామని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన విష‌యం తెలిసిందే. దీంతో అమెరికాలో (America) చదవాలని కలలుకంటున్న విద్యార్థులు భ‌య‌ప‌డుతున్నారు. ఫలితంగా వివాదానికి దారితీస్తాయని భావిస్తున్న పోస్టులను వారు డిలీట్ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో(US embassies) కొత్తగా విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారి ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ ను ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే తాత్కాలికంగా నిలిపివేసింది. ఏదిఏమైనా ట్రంప్ నిర్ణ‌యాలు అంద‌రిని హ‌డ‌లెత్తిస్తున్నాయి.

    More like this

    Ex Mla Jajala Surendar | రైతులను ఆదుకోకుంటే బీసీ సభను అడ్డుకుంటాం

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Ex Mla Jajala Surendar | ఇటీవలి భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని...

    Chakali Ailamma | పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ సేవలు మరువలేం..

    అక్షరటుడే, ఇందూరు: Chakali Ailamma | నగరంలోని బోర్గాం(పి) చౌరస్తా వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం...

    Kamareddy | గొర్ల మందను ఢీకొన్న లారీ.. గొర్ల కాపరితో సహా 30 గొర్లు మృతి

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | అతివేగంగా వస్తున్న లారీ గొర్ల మందపైకి దూసుకెళ్లగా గొర్ల కాపరితో పాటు 30...