అక్షరటుడే, హైదరాబాద్ : Fish Venkat : ప్రముఖ టాలీవుడ్ నటుడు(Tollywood actor) ఫిష్ వెంకట్ అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం బాగా క్షీణించడంతో నటుడికి వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.
కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఫిష్ వెంకట్ కొన్ని నెలల క్రితమే చికిత్స చేయించుకున్నారు. తాజాగా మరోసారి ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఎవరినీ గుర్తుపట్టేలేనంతగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
ఫిష్ వెంకట్ ఫ్యామిలీ ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతమవుతోంది. తాజాగా ఆయన ఆసుపత్రి పాలు కావడంతో తమను ఆదుకోవాలని వెంకట్ భార్య వేడుకుంటున్నారు. ఎవరైనా దాతలు అండగా నిలవాలని ఆయన భార్యతోపాటు కూతురు దయార్థ హృదయంతో అర్థిస్తున్నారు.
Fish Venkat : ఇటీవల పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం..
గతంలో చికిత్సకు డబ్బుల్లేక గాంధీ ఆస్పత్రిలో వెంకట్ వైద్యం చేయించుకున్నారు. అప్పుడు ఆయన పరిస్థితిని తెలుసుకున్న పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Power Star, Andhra Pradesh Deputy CM Pawan Kalyan) రూ. 2 లక్షల ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు. ఇప్పుడు ఫిష్ వెంకట్ ఆరోగ్యం మళ్లీ క్షీణించి ఆస్పత్రి పాలు కావడంతో అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.