అక్షరటుడే, వెబ్‌డెస్క్: Today Horoscope | రాశిచక్రం జీవితంలోని వివిధ రంగాలపై ఎలాంటి ప్రభావం చూపనుందో పండితులు వివరిస్తున్నారు. ఈ రోజు (నవంబరు 9) ఆయా రాశుల వారి ఆరోగ్యం, కుటుంబం, ఆర్థిక వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం..
మేషరాశి Aries : Today Horoscope | ఆరోగ్యం చాలా బాగుంటుంది. ప్రశాంతంగా, సంతోషంగా ఉండటం వలన మంచి శక్తి, ఆత్మవిశ్వాసం పొందుతారు. ఆఫీసులో కొన్ని కారణాల వల్ల విచారంగా ఉంటారు. కుతూహలం కలిగించే ఒక కొత్త వ్యక్తిని కలిసే అవకాశం ఉంది.
వృషభ రాశి Taurus : Today Horoscope | సౌమ్యమైన ప్రవర్తనకు మంచి ప్రశంసలు లభిస్తాయి. చాలా మంది మిమ్మల్ని మాటలతో పొగుడుతారు. కష్టపడే తత్వం, అంకితభావం గుర్తింపు పొందుతాయి.
ఇది మీకు కొన్ని ఆర్థిక లాభాలను కూడా తెస్తుంది. అందరినీ ఒక తాటిపైకి తెచ్చి, ఒకే లక్ష్యం కోసం పనిచేసేలా చేసే ‘టీమ్ వర్క్’ లీడర్ స్థానంలో శక్తివంతంగా ఉంటారు.
మిథున రాశి Gemini : Today Horoscope | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే అరవకూడదు. ఆర్థిక లావాదేవీలు నిరంతరం జరుగుతున్నప్పటికీ, ఇవాళ డబ్బును పొదుపు చేయగలుగుతారు. సంతోషకరమైన కుటుంబ జీవితం కోసం.. గోధుమ రంగు ఆవులకు గోధుమ, మొక్కజొన్న, బెల్లం కలిపి పెట్టండి.
కర్కాటక రాశి: Today Horoscope | క్షణికమైన కోప స్వభావం తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి జాగ్రత్త తప్పనిసరి. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన చెందవచ్చు. మీలో గల మంచి లక్షణాలు ఇతరుల నుంచి ప్రశంసలను అందుకునేలా చేస్తాయి.
సింహ రాశి: చుట్టూ ఉన్నవారు సహాయం చేయడం వలన సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం వల్ల ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. అనవసరమైన గొడవలకు తావివ్వకుండా, వాటిని శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి.
కన్యా రాశి: గొప్ప నేపథ్యం ఉన్న లేదా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులను కలుస్తారు. పెట్టుబడులు పెట్టిన వారికి ఆర్థిక నష్టాలు తప్పవు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెండింగులో ఉన్న సమస్యలను పరిష్కరిస్తారు.
తులా రాశి: చాలా కాలంగా అనుభవిస్తున్న టెన్షన్లు, అలసట , కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం మంచిది. ఇతరులను మురిపించే సామర్థ్యం, మంచి గుణం ప్రశంసలు, బహుమతులను తెస్తాయి.
వృశ్చిక రాశి: విజయం సాధించాలంటే కొత్త ఆలోచనలతో పాటు, అనుభవం ఉన్నవారు చెప్పినట్లుగా డబ్బును పెట్టుబడి పెట్టడం మంచిది. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తప్పనిసరి.
ధనుస్సు రాశి: మానసిక ఒత్తిడిని ఎదుర్కోవడానికి, ఆధ్యాత్మికత సహాయం తీసుకోవడానికి ఇది సరైన సమయం. పెట్టుబడుల విషయంలో స్వతంత్రంగా ఉండి, సొంత నిర్ణయాలు తీసుకోవాలి. అనుకోని అతిథి రావడం వలన కొన్ని పనులు వాయిదా పడతాయి.
మకర రాశి: తెలియని వ్యక్తుల నుంచి ధనం సంపాదించే అవకాశం ఉంది. దీని వలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లో ఏదైనా మార్పులు చేసే ముందు కుటుంబ సభ్యుల అభిప్రాయం తీసుకోండి. పాత సమస్యలు పరిష్కారం కాకపోవడం వల్ల ఒత్తిడికి గురవుతారు.
కుంభ రాశి: పెట్టుబడి పథకాల గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించిన తర్వాతే పెట్టుబడి పెట్టండి. అనుకోని శుభవార్త శక్తిని, ఉత్సాహాన్ని పెంచుతుంది. ఈ వార్తను కుటుంబ సభ్యులతో పంచుకోవడం ద్వారా మరింత ఆనందం పొందవచ్చు. ఏ పోటీలో పాల్గొన్నా.. మీలోని పోటీతత్వం కారణంగా గెలుపొందుతారు.
మీన రాశి: ఇతరులు మిమ్మల్ని అవసరాలకు వాడుకుంటారు. వారిని గుర్తించి దూరంగా ఉండటం మంచిది. కుటుంబంలో పరిస్థితిని అదుపులో ఉంచడానికి ప్రశాంతంగా ఉండటం మంచిది.
లేదంటే గొడవలకు దారి తీస్తుంది. ఇవాళ విహారయాత్రకు వెళ్తారు. స్నేహితుల ముందు అతిగా ప్రవర్తిస్తే మీ మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతింటాయి.
