tirupati govindaraja swamy temple : తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో అర్ధరాత్రి వేళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏకాంత సేవ అనంతరం ఆలయం మూసివేసిన తర్వాత ఓ అజ్ఞాత వ్యక్తి మద్యం మత్తులో ఆలయంలోకి చొరబడ్డాడు. విజిలెన్స్ సిబ్బంది కళ్లుగప్పి మహాద్వారం లోపలికి ప్రవేశించిన అతడు నేరుగా ఆలయ గోపురంపైకి ఎక్కి నినాదాలు చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.
ఈ విషయాన్ని గమనించిన వెంటనే ఆలయ విజిలెన్స్ సిబ్బంది, తిరుపతి Tirupatiఈస్ట్ పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అతడ్ని కిందకు దిగమని పలుమార్లు కోరినప్పటికీ అతడు నిరాకరించాడు. దాదాపు మూడు గంటల పాటు సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించగా, చివరకు ఫైర్ సిబ్బంది సహాయంతో గోపురానికి నిచ్చెనలు వేసి, తాళ్లతో బంధించి బలవంతంగా కిందకు దించారు. అనంతరం అతడ్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
tirupati govindaraja swamy temple : మద్యం మత్తులో..
పోలీసుల విచారణలో గోపురంపైకి ఎక్కిన వ్యక్తి నిజామాబాద్ జిల్లాకు చెందిన తిరుపతిగా tirupati గుర్తించారు. అతడు మద్యం మత్తులో ఉన్నాడని, మానసిక స్థితి కూడా సరిగా లేదని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు, తనకు మద్యం బాటిల్ ఇస్తేనే కిందకు దిగుతానని అతడు పట్టుబట్టినట్టు సమాచారం.
ఈ క్రమంలో ఆలయ గోపురంపై ఉన్న కలశాలను లాగేందుకు కూడా ప్రయత్నించాడని, అయితే అవి రాలేదని అధికారులు తెలిపారు. ఆలయంలోకి అతడు ఎలా ప్రవేశించగలిగాడన్న అంశంపై సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలిస్తూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో గోవిందరాజస్వామి ఆలయం పరిసరాల్లో కొంతసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఇదిలా ఉండగా, టీటీడీ అనుబంధ ఆలయాల్లో భక్తుల రద్దీ క్రమేణా పెరుగుతున్న నేపథ్యంలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ Anil Kumar Singhal అధికారులను ఆదేశించారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో భక్తులకు అందిస్తున్న సదుపాయాలపై ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
దివ్యాంగ భక్తులు సౌకర్యవంతంగా రాకపోకలు సాగించేందుకు చెక్క బల్లలతో వుడెన్ ర్యాంప్ ఏర్పాటు చేయాలని, సెల్ ఫోన్, లగేజీ కౌంటర్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని సూచించారు. ఇప్పటికే ఉన్న మరుగుదొడ్లకు మరమ్మత్తులు చేపట్టాలని, చంటి పిల్లల తల్లులు పాలిచ్చేందుకు ప్రత్యేక క్యాబిన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఆలయ ప్రవేశ ద్వారాల వద్ద లోహాలను గుర్తించే భద్రతా పరికరాలు ఏర్పాటు చేయాలని, క్యూలైన్లను భక్తుల రాకపోకలకు అనుగుణంగా రూపొందించాలని సూచించారు. ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా, ఆకర్షణీయంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, మెరుగైన విద్యుత్ కాంతులు ఏర్పాటు చేయాలని తెలిపారు.