HomeతెలంగాణHarish Rao | కేసీఆర్​కు పేరు వస్తుందనే టిమ్స్​ ఆస్పత్రులను నిర్మించడం లేదు : హరీశ్​రావు

Harish Rao | కేసీఆర్​కు పేరు వస్తుందనే టిమ్స్​ ఆస్పత్రులను నిర్మించడం లేదు : హరీశ్​రావు

Harish Rao | హైదరాబాద్​ నగరంలో టిమ్స్​ ఆస్పత్రుల నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని మాజీ మంత్రి హరీశ్​రావు డిమాండ్​ చేశారు. ఎల్బీ నగర్​లో నిర్మాణంలో ఉన్న టిమ్స్​ ఆస్పత్రిని ఆయన పరిశీలించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao | కేసీఆర్​కు పేరు వస్తుందనే కాంగ్రెస్​ ప్రభుత్వం హైదరాబాద్​ నగరంలో టిమ్స్​ ఆస్పత్రుల నిర్మాణం పూర్తి చేయడం లేదని మాజీ మంత్రి హరీశ్​రావు ఆరోపించారు. ఎల్బీ నగర్​లో నిర్మాణంలో ఉన్న టిమ్స్​ ఆస్పత్రి(TIMS Hospital)ని ఆయన పరిశీలించారు.

హరీశ్​రావు(Harish Rao) మాట్లాడుతూ.. కేసీఆర్​ ముందు చూపుతో హైదరాబాద్ నలుదిక్కుల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించాలని సంకల్పించారన్నారు. ఎల్బీనగర్​, మల్కాజ్​గిరి, ఎర్రగడ్డలో వేయి పడకలు, నిమ్స్​ 2 వేల పడకల ఆస్పత్రి నిర్మించాలని నిర్ణయించారన్నారు. గతంలో ప్రభుత్వాలు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరంలో ఆస్పత్రుల నిర్మాణం చేపట్టలేదని చెప్పారు. పేదల కోసం నాలుగు టిమ్స్​ ఆస్పత్రుల నిర్మాణాలను తమ హయాంలో ప్రారంభించామన్నారు. అవసరమైన నిధులను కూడా కేసీఆర్​ సమకూర్చాని చెప్పారు. అయితే కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక టిమ్స్​ ఆస్పత్రులను పట్టించుకోవడం లేదని హారీశ్​ రావు ఆరోపించారు.

బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఉండి ఉంటే ఏడాది క్రితమే ఆస్పత్రి ప్రారంభించే వారమన్నారు. వీటి నిర్మాణం పూర్తి చేస్తే కేసీఆర్(KCR)​కు పేరు వస్తుందనే రేవంత్​రెడ్డి పక్కన పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్​ నాయకులకు రాజకీయాలు తప్ప పేదల సమస్యలు పట్టవన్నారు. ఎందుకు ఆస్పత్రుల నిర్మాణం ఆలస్యమైందని ఆయన ప్రశ్నించారు.

Harish Rao | జైల్లో వేసుకోండి

వరంగల్​లో హెల్త్​ సిటీని, టిమ్స్​ ఆస్పత్రుల నిర్మాణం తక్షణమే పూర్తి చేయాలని ఆయన డిమాండ్​ చేశారు. రాజకీయ కక్ష ఉంటే తమపై కేసులు పెట్టుకోవాలని, జైలులో వేసిన సరే అని ఆయన అన్నారు. కానీ పేదలకు వైద్యం ఆపొద్దన్నారు. తాము గతంలో మెడికల్ కాలేజీలను మంజూరు చేస్తే కాంగ్రెస్​ ప్రభుత్వం రద్దు చేసిందని హరీశ్​రావు ఆరోపించారు. మహేశ్వరం మెడికల్​ కాలేజీని ఎల్బీ నగర్​ టిమ్స్​లో, కుత్బుల్లాపూర్​ నియోజకవర్గంలో ఏర్పాటు చేయాల్సిన మెడికల్ కాలేజీని అల్వాల్​ టిమ్స్​లో విలీనం చేశారన్నారు.

Harish Rao | బకాయిలు విడుదల చేయాలి

సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) ఆరోగ్య శ్రీ చికిత్స పరిమితి రూ.10 లక్షలకు పెంచానని చెబుతున్నారని, కానీ ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో వాళ్లు బంద్​ చేస్తామంటున్నట్లు హరీశ్​రావు చెప్పారు.కాంగ్రెస్​ పాలనలో కాలేజీలు బంద్ చేస్తామని ప్రైవేట్ కాలేజీలు, ఆసుపత్రులు బంద్ చేస్తామని ప్రైవేట్ ఆసుపత్రులు చెబుతున్నాయన్నారు. కేసీఆర్​ హయాంలో ఆరోగ్య శ్రీ బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించి పేదలకు వైద్యం అందేలా చూశామన్నారు. కానీ రేవంత్​రెడ్డి రూ.1400 కోట్లు ఆరోగ్యశ్రీ కింద బకాయి పెట్టారని విమర్శించారు. వెంటనే నిధులు విడుదల చేసి పేదలకు వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని హరీశ్​రావు డిమాండ్​ చేశారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, వివేకానంద గౌడ్​ తదితరులు ఉన్నారు.