Homeజిల్లాలుకామారెడ్డిMohammad nagar | సమయపాలన పాటించని అధికారులు

Mohammad nagar | సమయపాలన పాటించని అధికారులు

- Advertisement -

అక్షరటుడే నిజాంసాగర్:Mohammad nagar | ప్రభుత్వశాఖల్లో అధికారులు సమయపాలనపై ఏమాత్రం శద్ధ పెట్టడం లేదు. వివరాల్లోకి వెళ్తే.. శనివారం మహమ్మద్​నగర్​ మండల ప్రజాపరిషత్ కార్యాలయం(Praja Parishad Office)లో సమయం 11 గంటలైనా అధికారులు పత్తాలేకుండా పోయారు. ఎంపీడీవో(MPDO) క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లగా కంప్యూటర్ ఆపరేటర్(Computer Operator) మినహా ఏ ఒక్క అధికారి కూడా అందుబాటులో లేరు.

ఇక ఇటీవల కొత్తగా ఏర్పాటైన మహమ్మద్​నగర్​ తహశీల్దార్​ కార్యాలయం(Tahsildar Office)లో కూడా అధికారులు సమయపాలన పాటించట్లేదని మండల ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా ప్రభుత్వ కార్యాలయాల్లో(Government office) అధికారులు సమయపాలన పాటించేలా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.