HomeతెలంగాణIPS Officers | భూదాన్​ భూముల కేసు.. కోర్టును ఆశ్రయించిన ముగ్గురు ఐపీఎస్​లు

IPS Officers | భూదాన్​ భూముల కేసు.. కోర్టును ఆశ్రయించిన ముగ్గురు ఐపీఎస్​లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPS Officers | భూదాన్​ భూముల Bhoodan lands కేసులో ముగ్గురు ఐపీఎస్ IPS​ అధికారులు హైకోర్టును High Court ఆశ్రయించారు. రంగారెడ్డి Rangareddy జిల్లా మహేశ్వరం Maheswaram మండలం నాగారం గ్రామంలో భూదాన్​ భూములను కొందరు ఐఏఎస్​, ఐపీఎస్​ అధికారులు అక్రమంగా రిజిస్ట్రేషన్​ చేసుకున్నారని బిర్లా మహేశ్​ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్​ వేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్​ బెంచ్ Single Bench​ ఆ భూములను విచారణ పూర్తయ్యే వరకు నిషేధిత జాబితాలో పెట్టాలని ఆదేశించింది. దీంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ ఐపీఎస్​ అధికారులు మహేష్ భగవత్, స్వాతి లక్రా, సౌమ్య మిశ్రా హైకోర్టును ఆశ్రయించారు.

IPS Officers | హైకోర్టు కీలక వ్యాఖ్యలు

భూదాన్ కేసు విచారణ సందర్భంగా సింగిల్​ బెంచ్​ జడ్జి భాస్కర్​రెడ్డి ఈ నెల 24న కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారులు మోసపూరితంగా ఎలా పట్టా చేసుకున్నారో, రికార్డులు ఎలా తారు మారు చేశారో తేలాల్సి ఉందని పేర్కొన్నారు. అంతవరకు ఈ భూముల్లో ఎలాంటి లావాదేవీలు జరగకుండా నిషేధిత జాబితాలో చేర్చాలని సూచించారు. ఇందులో సీనియర్​ ఐఏఎస్​, ఐపీఎస్​ అధికారుల పాత్ర ఉన్నట్లు పిటిషనర్​ వాదిస్తుండడంతో సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని సూచించారు. అలాగే ఈ పిటిషన్​ ఉపసంహరించుకోవడానికి అవకాశం ఇవ్వొద్దని కోర్టు రిజిస్ట్రీని జడ్జి ఆదేశించారు.

IPS Officers | ఈడీ దాడులు

భూదాన్​ భూములపై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, ఈడీ ED, సీబీఐ CBIకి నోటీసులు పంపింది. దీంతో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. హైదరాబాద్‌ Hyderabadలో పలు చోట్ల ఈడీ సోదాలు ED raids నిర్వహించింది. సోమవారం మొత్తం 13 చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. బిజినెస్​మ్యాన్ మునావర్ ఖాన్ ఇల్లు, ఆఫీసులు, బంధువుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. ఆయనకు చెందిన 40 వింటేజ్ కార్లు సీజ్ చేశారు. అలాగే భారీగా భూదాన్ భూముల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కాగా మునావార్​ వందల ఎకరాల భూదాన్​ భూములు కబ్జా చేసి రియల్టర్లు, అధికారులకు అమ్మినట్లు ఈడీ గుర్తించింది.