Stock market | రోజంతా ఒడిదుడుకులు

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock market | దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock market) రోజంతా ఒడిదుడుకుల(Volitility) మధ్య కొనసాగింది. చివరికి ఫ్లాట్‌గా ముగిసింది. మంగళవారం ఉదయం 178 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్‌(Sensex).. ఇంట్రాడేలో గరిష్టంగా 443 పాయింట్లు లాభపడిరది. 42 పాయింట్ల లాభంతో ప్రారంభమైన నిఫ్టీ(Nifty).. ఇంట్రాడేలో గరిష్టంగా 129 పాయింట్లు పెరిగింది. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో సూచీలు(Indices) పడిపోయాయి. ఇంట్రాడే గరిష్టాలనుంచి సెన్సెక్స్‌ 549 పాయింట్లు, నిఫ్టీ 167 పాయింట్లు(Points) నష్టపోయాయి. చివరికి […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock market | దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock market) రోజంతా ఒడిదుడుకుల(Volitility) మధ్య కొనసాగింది. చివరికి ఫ్లాట్‌గా ముగిసింది. మంగళవారం ఉదయం 178 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్‌(Sensex).. ఇంట్రాడేలో గరిష్టంగా 443 పాయింట్లు లాభపడిరది. 42 పాయింట్ల లాభంతో ప్రారంభమైన నిఫ్టీ(Nifty).. ఇంట్రాడేలో గరిష్టంగా 129 పాయింట్లు పెరిగింది. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో సూచీలు(Indices) పడిపోయాయి. ఇంట్రాడే గరిష్టాలనుంచి సెన్సెక్స్‌ 549 పాయింట్లు, నిఫ్టీ 167 పాయింట్లు(Points) నష్టపోయాయి. చివరికి సెన్సెక్స్‌ 70 పాయింట్ల లాభంతో 80,288 వద్ద, నిఫ్టీ 7 పాయింట్ల లాభంతో 24,335 వద్ద స్థిరపడ్డాయి.

Stock market | రాణించిన డిఫెన్స్‌, ఐటీ షేర్లు..

భారత్‌, పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో డిఫెన్స్‌(Defence) షేర్లలో భారీ ర్యాలీ వచ్చింది. పారస్‌ డిఫెన్స్‌ 17 శాతం, డాటా ప్యాటర్న్స్‌ 14.34 శాతం, బీఈఎల్‌ 4 శాతం మేర లాభపడ్డాయి. ఐటీ(IT), ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సెక్టార్లు లాభపడ్డాయి. ఫార్మా, మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంక్‌, ఆటో, ఎనర్జీ(Energy) రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీలలో 1,830 లాభాలతో, 2,095 నష్టాలతో ముగియగా.. 129 కంపెనీలు(Companies) ఫ్లాట్‌గా ఉన్నాయి. 64 కంపెనీలు 52 వారాల గరిష్టాలకు చేరగా.. 33 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద ట్రేడ్‌ అయ్యాయి. 10 అప్పర్‌ సర్క్యూట్‌ను, 7 లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 22 పైసలు పడిపోయింది.

Stock market | Top Gainers..

బీఎస్‌ఈ(BSE) సెన్సెక్స్‌ 30 ఇండెక్స్‌(Index)లో 14 కంపెనీలు లాభాలతో ముగియగా 16 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. రిలయన్స్‌ 2.32 శాతానికిపైగా పెరిగి నిఫ్టీ, సెన్సెక్స్‌లు నిలబడడానికి కారణమైంది. టెక్‌ మహీంద్రా(Tech Mahindra) 2.14 శాతం పెరిగింది. ఎటర్నల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌ ఒక శాతానికిపైగా లాభపడ్డాయి.

Stock market | Top Losers..

అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 2.39 శాతం, సన్‌ఫార్మా(Sun pharma) 2.01 శాతం పడిపోయాయి. పవర్‌గ్రిడ్‌, ఎన్టీపీసీ, ఒక శాతానికిపైగా నష్టపోయాయి.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...