అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indian stock market gains | లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్.. ఐటీ సెక్టార్లో అమ్మకాల ఒత్తిడితో కొద్ది సేపటికే నష్టాల బాట పట్టింది. లాభనష్టాల మధ్య ఊగిసలాడిన ప్రధాన సూచీలు.. చివరి గంటన్నరలో కోలుకున్నాయి. మెటల్, బ్యాంకింగ్ స్టాక్స్ రాణించడంతో లాభాలతో ముగిశాయి. బుధవారం ఉదయం సెన్సెక్స్ 103 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 51 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 440 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 27 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 7 పాయింట్లు లాభపడింది. అక్కడినుంచి 114 పాయింట్లు నష్టపోయింది. అయితే కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు కోలుకున్నాయి. ఇంట్రాడే కనిష్టాలనుంచి సెన్సెక్స్ 607 పాయింట్లు, నిఫ్టీ 183 పాయింట్లు పెరిగాయి. చివరికి సెన్సెక్స్ 283 పాయింట్ల లాభంతో 83,734 వద్ద, నిఫ్టీ 93 పాయింట్ల లాభంతో 25,819 వద్ద స్థిరపడ్డాయి.
Indian stock market gains | రాణించిన మెటల్, ఎఫ్ఎంసీజీ స్టాక్స్..
మెటల్, ఎఫ్ఎంసీజీ, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ అండ్ గ్యాస్, రియాలిటీ, టెలికాం, ఎనర్జీ, బ్యాంకింగ్, ఆటో రంగాల షేర్లు రాణించాయి. ఒక రోజు లాభాలతో ముగిసిన ఐటీ సెక్టార్ మళ్లీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఇంట్రాడేలో 1.23 శాతం నష్టపోయింది.
అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,237 కంపెనీలు లాభపడగా 1,955 స్టాక్స్ నష్టపోయాయి. 191 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 112 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 100 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 5 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 7 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 2 లక్షల కోట్ల మేర పెరిగింది.
Top gainers..
బీఎస్ఈ సెన్సెక్స్‌లో 18 స్టాక్స్ లాభాలతో, 12 స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. టాటా స్టీల్ 2.90 శాతం, ఐటీసీ 2.21 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.51 శాతం, రిలయన్స్ 1.30 శాతం, ఎం&ఎం 1.18 శాతం లాభపడ్డాయి.
Top losers..
ఎటర్నల్ 1.53 శాతం, టెక్‌మహీంద్రా 1.34 శాతం, ఇన్ఫోసిస్ 1.27 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.06 శాతం, అదానిపోర్ట్స్ ఒక శాతం నష్టపోయాయి.