అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Prime Minister Modi | ఇది సరికొత్త భారత్ అని, ఉగ్రవాదులను ముందు పెట్టి దాడి చేస్తే ప్రతి దాడి దారుణంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) హెచ్చరించారు.
నేరుగా పాకిస్తాన్ మీద విమర్శలు ఎక్కుపెట్టిన మోదీ.. ఆ దేశం ఎప్పుడూ మనతో నేరుగా యుద్ధానికి దిగలేదని, ఉగ్రవాదులను ముందు పెట్టి మన మీద పోరాటం చేస్తోందన్నారు. ఆ దేశానికి ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)తో తగిన బుద్ధి చెప్పామని, మన భద్రతా బలగాలు పాకిస్తాన్‌ను మోకాళ్ల మీద కూర్చోబెట్టాయని ఎద్దేవా చేశారు. ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి 22 నిమిషాల్లోనే ప్రతీకారం తీర్చుకున్నామని వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంతో దేశ ప్రజలంతా గర్విస్తున్నారని, దేశమంతటా తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా 18 రాష్ట్రాల్లో అత్యాధునికంగా తీర్చిదిద్దిన అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను మోదీ గురువారం రాజస్థాన్‌లోని బికనీర్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ఆయన.. పాక్ తీరును దుయ్యబట్టారు.
Prime Minister Modi | పాక్‌కు చుక్కలు చూపించాం..
ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్(pakistan)కు చుక్కలు చూపించామని మోదీ తెలిపారు. భారత్‌పై దాడులకు పాల్పుడుతున్న ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టామని చెప్పారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో అమాయకులైన 26 మందిని పొట్టన బెట్టుకున్నారని, మహిళల నుదుటి సిందూరం చెరిపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడిని గుర్తుచేసుకుంటూ, ఉగ్రవాదులు దేశ సోదరీమణులను వారి మతాన్ని అడగడం ద్వారా వారి ‘సిందూర్’ (సిందూర్)ను నాశనం చేశారని ప్రధాని మోదీ అన్నారు. పహల్గామ్‌లో ఉగ్రవాదుల కాల్పులు జరిగాయి, కానీ అవి దేశంలోని 140 కోట్ల మంది పౌరుల హృదయాల్లోకి చొచ్చుకుపోయాయని ప్రధాని పేర్కొన్నారు. ఏప్రిల్ 22న జరిగిన దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక దాడి 22 నిమిషాల్లోనే ముగిసిందని చెప్పారు. పాకిస్తాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడులు చేసి నేలమట్టం చేశామన్నారు.
Prime Minister Modi | దళాలకు పూర్తి స్వేచ్ఛ
ఉగ్రవాదులపై(Terrorists) పోరాటంలో భాగంగా త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని మోదీ వెల్లడించారు. భారత సాయుధ దళాల ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత, సింధూరం తుపాకీ మందుగా మారినప్పుడు ఏమి జరుగుతుందో దేశానికి తెలుసని ప్రధాన మంత్రి అన్నారు. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) న్యాయానికి కొత్త రూపమని తెలిపారు. “దునియా భర్ నే దేఖ్ లియా జబ్ సిందూర్ బరూద్ బన్ జాతా హై తబ్ నతీజా క్యా హోతా హై” అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు.
ప్రతి పౌరుడు ఐక్యంగా ఉండి ఉగ్రవాదులకు తగిన సమాధానం ఇస్తామని, వారు ఊహించలేనంత పెద్ద శిక్ష వేస్తామని ప్రతిజ్ఞ చేశాడన్నారు. ఈ రోజు “మీ ఆశీర్వాదాలతో, దేశ సైన్యం శౌర్యంతో, మనమందరం ఆ ప్రతిజ్ఞకు కట్టుబడి ఉన్నాము” అని తెలిపారు. సాయుధ దళాలకు ఇచ్చిన స్వేచ్ఛా హస్తం ఫలితంగా పాకిస్తాన్ మోకరిల్లాల్సి వచ్చిందని తెలిపారు. ‘వైమానిక దాడి తర్వాత ‘ఈ నేలపై ప్రమాణం చేస్తున్నాను, నా దేశాన్ని నాశనం చేయనివ్వను, నా దేశం తలవంచనివ్వను’ అని మోదీ గంభీరంగా చెప్పారు. ఈ రోజు రాజస్థాన్ నేల నుంచి చెబుతున్నా.. సిందూరాన్ని తుడిచిపెట్టడానికి బయలుదేరిన వారు దుమ్ముగా మారారని దేశ ప్రజలకు చెప్పాలనుకుంటున్నానని తెలిపారు.
Prime Minister Modi | భారత్ మౌనంగా ఉండదు..
జాతి రక్తాన్ని చిందించిన వారు నేడు ప్రతి ఒక్క చుక్కను లెక్కించారని మోదీ అన్నారు. “భారతదేశం(India) మౌనంగా ఉంటుందని భావించిన వారు నేడు తమ ఇళ్లలో దాక్కున్నారు. తమ ఆయుధాల పట్ల గర్వపడేవారు నేడు శిథిలాల కుప్ప కింద ఖననం చేయబడ్డారు” అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్‌ను న్యాయానికి కొత్త రూపంగా ఆయన అభివర్ణించారు. ఇది ప్రతీకార ఆట కాదని తెలిపారు. “ఇది కేవలం కోపం కాదు, ఇది సమర్థ భారతదేశ ఉగ్ర రూపం, ఇది భారతదేశ కొత్త రూపం” అని ప్రధాని వ్యాఖ్యానించారు. న్యాయానికి ఆపరేషన్ సిందూర్ కొత్త రూపం. ఇది పాత భారత్ కాదు.. సరికొత్త భారత్ అని తెలిపారు. ఇది ఆక్రోశం కాదు. భారత ప్రజల రౌద్రరూపం. ఇది భారత కొత్త స్వరూపమని చెప్పారు.
Prime Minister Modi | పాక్ వక్రబుద్ధిని ఎండగడతాం..
పాకిస్తాన్‌ల వక్రబుద్ధిని ప్రపంచం మొత్తం చూసిందని మోదీ అన్నారు. ఉగ్రవాదాన్ని(Terrorism) ఎగదోస్తున్న ఆ దేశం తీరును ప్రపంచ దేశాలకు చెప్పేందుకు ఎంపీల బృందాలు వెళ్లాయని చెప్పారు. పాక్ ఎప్పుడూ భారత్‌తో నేరుగా తలపడలేదని, ప్రతిసారి ఉగ్రవాదులను ముందుపెట్టి భారత్‌పై దాడి చేస్తుందని మోదీ గుర్తు చేశారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇదే కొనసాగుతోందన్నారు. అయితే, ఈసారి పాకిస్తాన్ ఒక విషయం మరిచిపోయిందని, ఇక్కడ భారత సేవకుడు మోదీ(PM Modi) ఉన్నాడన్న విషయం శత్రుదేశం మర్చిపోయిందని తెలిపారు. మోదీ మనస్సు చల్లగా ఉంటుందేమో కానీ నా నరాలెప్పుడూ ఉప్పొంగుతాయని తెలిపారు.
Prime Minister Modi | పీవోకేపైనే చర్చలు..
పాకిస్తాన్ ప్రతీకార చర్యలను భారత దళాలు(Indian forces) సమర్థవంతంగా తిప్పికొట్టాయని మోదీ తెలిపారు. ఇక్కడి బికనీర్‌లోని ఎయిర్‌బెస్‌ను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించింది కానీ, ఆ ప్రయత్నాలను తిప్పికొట్టామన్నారు. అంతేకాదు, పాకిస్తాన్‌లోని నూర్‌ఖాన్ సహా అనేక ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేశామన్నారు. భారత సాయుధ దళాలు ఉగ్రవాదుల అతిపెద్ద స్థావరాన్ని నాశనం చేశాయని ప్రధాని మోదీ అన్నారు. “సిందూరం గన్‌పౌడర్‌గా మారినప్పుడు ఏమి జరుగుతుందో ప్రపంచం, దేశ శత్రువులు చూశాయని” ఆయన అన్నారు. పాక్ ఎయిర్‌బేస్(Pakistan airbase)లను ఎప్పుడు తెరుస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొందన్నారు. భారత దయ తలచకుంటే పాక్‌కు చుక్కనీరు కూడా దొరకదని మోదీ గుర్తు చేశారు. అణుబాంబును బూచిగా చూపితే భారత్ భయపడదని, ఇది సరికొత్త భారతావని అని తెలిపారు. పాకిస్తాన్‌తో చర్చలు జరిపితే అది కేవలం ఉగ్రవాదం, పీవోకే పైన మాత్రమేనని స్పష్టం చేశారు.
Prime Minister Modi | పాక్ మూల్యం చెల్లించాల్సిందే
భారతదేశానికి హక్కుగా దక్కాల్సిన నీటిని పాకిస్తాన్ పొందదని, భారతీయుల రక్తంతో ఆడుకున్నందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ప్రధాని మోదీ హెచ్చరించారు. పాకిస్తాన్‌తో వాణిజ్యం లేదా చర్చలు ఉండవని స్పష్టం చేశారు. చర్చలు ఉంటే అది కేవలం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ గురించి మాత్రమే ఉంటుందని ఆయన అన్నారు. భారతదేశం(India) అణు బెదిరింపులకు భయపడబోదని చెబుతూ, పాకిస్తాన్ యొక్క రహీమ్ యార్ ఖాన్ వైమానిక స్థావరం ఇప్పుడు ఐసీయూలో ఉందని ప్రధాని మోదీ అన్నారు.

