అక్షరటుడే,బోధన్:Navipet Police | కంట్లో కారం చల్లి వృద్ధురాలి నుంచి నగలు లాక్కెళ్లిన కిలేడీని స్థానికులు పట్టుకున్నారు. ఈ ఘటన నవీపేట మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నవీపేట్(Navipet) బస్టాండ్‌లో నారాయణపూర్‌కు వెళ్లేందుకు ఓ వృద్ధురాలు వేచి ఉంది. అయితే కొందరు మహిళలు ఆమెతో మాటలు కలిపారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు వృద్ధురాలు వెళ్లగా ఆమె వెంటే వెళ్లి కళ్లలో కారం చల్లారు. కత్తితో బెదిరించి ఆమె వద్ద ఉన్న ఆభరణాలు మొత్తం దోచుకున్నారు. అయితే వృద్ధురాలి అరుపులతో స్పందించిన స్థానికులు కిలేడీలను పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ వారిలో ఒక మహిళ మాత్రమే పట్టుబడింది. అనంతరం పోలీసులకు(Police) సమాచారం ఇవ్వగా మహిళను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్(Police Station)కు తరలించారు.
