అక్షరటుడే, వెబ్‌డెస్క్: Gangula Kamalakar | అసెంబ్లీని గాంధీ భవన్‌లా (Gandhi Bhavan) నడిపిస్తున్నారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. శనివారం ఆయన తెలంగాణ భవన్లో (Telangana Bhavan) మీడియాతో మాట్లాడారు.
ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇన్ని అవమానాలు ఎదుర్కోలేదన్నారు. ఉద్యమ సమయంలో సైతం సభ్యులకు అందరికీ సమాన హక్కులు ఉంటాయని అప్పటి స్పీకర్ మనోహర్ తమకు సమయం ఇచ్చారన్నారు. కానీ శుక్రవారం స్పీకర్ తీరు బాధాకరమని ఆయన అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలా నిర్బంధం చేయలేదని, తమ గొంతు నొక్కలేదన్నారు. స్పీకర్ పక్షపాత వైఖరితో ఉండొద్దన్నారు. ఆయన వ్యవహార శైలి మార్చుకోవాలని కోరారు.
Gangula Kamalakar | తిట్టడానికి వచ్చారు..
సభలో ముఖ్యమంత్రికి ఎలాంటి హక్కు ఉంటుందో తమకు అదే హక్కు ఉంటుందని గంగుల అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తమను తిట్టేందుకు మాత్రమే నిన్న సభకు వచ్చారన్నారు. క్వశ్చన్ అవర్‌లో ముఖ్యమంత్రి 2 గంటలు మాట్లాడుతారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని విమర్శించకుండా భజన చేయాలా అన్నారు. ముఖ్యమంత్రిని విమర్శిస్తే మైక్ ఇవ్వం అని స్పీకరే స్వయంగా చెప్పడం ఏమిటన్నారు. బీఆర్ఎస్ హయాంలో అసెంబ్లీ (Assembly) హుందాగా నడిచిందన్నారు. స్పీకర్ ప్రతిపక్షాలకు తగినంత సమయం ఇచ్చేవారన్నారు. ప్రస్తుతం స్పీకర్ బీఆర్ఎస్ సభ్యుల గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు.