- Advertisement -
Homeజిల్లాలుకామారెడ్డిDharmacharya Darshan Yatra | రామరాజ్యం పేరుతో ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు.

Dharmacharya Darshan Yatra | రామరాజ్యం పేరుతో ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి:Dharmacharya Darshan Yatra | రామరాజ్యం సంస్థ పేరిట తనకు బెదిరింపు ఫోన్లు చేస్తున్నారని ధర్మాచార్య దర్శన యాత్ర వ్యవస్థాపకులు పవన్ కుమార్ శర్మ(Pavan Kumar Sharma) తెలిపారు. శుక్రవారం ఆయన ఎస్పీ రాజేష్​ చంద్ర(SP Rajesh Chandra)ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో చిలుకూరు అర్చకులు రంగరాజన్​పై రామరాజ్యం సంస్థ పేరిట దాడులు చేస్తే సీఎం(CM)తో సహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఖండించాయని గుర్తు చేశారు. అందరితో పాటు తాను కూడా రంగరాజన్(Rangarajan)​పై దాడిని ఖండించానని తెలిపారు. దాంతో సదరు సంస్థ ముఖ్యలు తరచూ ఫోన్లు చేస్తూ బెదిరిస్తున్నారని.. వాళ్లు చెప్పినట్లుగా చేయకపోతే తన యాత్రను అడ్డుకుంటామని చెబుతున్నారన్నారు. తక్షణమే అతడిపై చర్యలు తీసుకోవాలని పిర్యాదులో పేర్కొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News